Shaliza Dhami : ఎయిర్ ఫోర్స్ కెప్టెన్ గా షాలిజా ధామి
నాయకత్వం వహించేందుకు రెడీ
Shaliza Dhami : షాలిజా దామిని చరిత్ర సృష్టించనుంది. ఎయిర్ ఫోర్స్ ఫ్రంట్ లైన్ కంబాబ్ యూనిట్ కి మహిళా అధికారిగా రానున్నారు. భారత వైమానిక దళం పాశ్చాత్య సెక్టార్ లోని ఫ్రంట్ లైన్ కంబాట్ యూనిట్ కు నాయకత్వం వహించనున్నారు. ఈ మేరకు గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు షాలిజా దామిని(Shaliza Dhami) . మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా షాలిజా ఎంపిక మహిళా లోకానికి స్పూర్తి దాయకం కానుంది. ఐఏఎఫ్ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఒక మహిళా అధికారికి ఫ్రంట్ లైన్ కంబాట్ యూనిట్ కు ఎంపిక చేయడం విశేషం. ఆమె అసాధారణమైన ప్రతిభకు, పట్టుదలకు, నిబద్దతకు దక్కిన గౌరవం అని చెప్పక తప్పదు.
ఈ నెల ప్రారంభంలో సైన్యం మొదటిసారిగా కమాండ్ పాత్రలకు మహిళా అధికారులను కేటాయించడం ప్రారంభించింది. వీరిలో దాదాపు 50 మంది ఫార్వర్డ్ తో సహా కార్యాచరణ ప్రాంతాల్లో యూనిట్ లకు చీఫ్ లు గా వ్యవహరిస్తారు. ఇది ఉత్తర, తూర్పు కమాండ్ లలో జరుగుతుంది. ఇక గ్రూప్ కెప్టెన్ ధామి 2003లో హెలికాప్టర్ పైలట్ గా నియమితులయ్యారు.
2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం కలిగి ఉన్నారు షాలిజా దామి(Shaliza Dhami) . క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్ స్ట్రక్టర్ గా ఉన్నారు. ఆమె వెస్ట్రన్ సెక్టార్ లోని హెలికాప్టర్ యూనిట్ కు ఫ్లైట్ కమాండర్ గా పని చేశారు. ఐఏఎఫ్ లో గ్రూప్ కెప్టెన్ ఆర్మీలో కల్నల్ తో సమానం.
Also Read : సీబీఐకి లాలూ కూతురు వార్నింగ్