Shabana Azmi : బిల్కిస్ దోషుల విడుదల సిగ్గు చేటు
నిప్పులు చెరిగిన నటి షబానా ఆజ్మీ
Shabana Azmi : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో(Bilkis Bano) సామూహిక అత్యాచారం, కుటుంబీకుల హత్య కేసులో దోషులను పంధ్రాగష్టు రోజు గుజరాత్ బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది.
దీనిపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఎనిమిది వేల మందికి పైగా మహిళలు, హక్కుల సంఘాలు, కార్యకర్తలు సంతకాలతో కూడిన లేఖను సుప్రీంకోర్టు జడ్జికి రాశారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు తమిళనాడు నటి, నాయకురాలు ఖుష్బూ సుందర్ సీరియస్ గా స్పందించారు.
దోషులకు పూల దండలతో స్వాగతం పలకడం ఒక రకంగా నేరాన్ని ఆమోదించడమేనని పేర్కొన్నారు. ఇది పూర్తిగా స్త్రీత్వానికి మాయని మచ్చగా అభివర్ణించారు.
ఆనాటి గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోకి 21 ఏళ్ల వయస్సు. 5 నెలల గర్భిణీ. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 5 ఏళ్ల చిన్నారిని బండరాయితో చంపారు.
ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన చాలా దారుణమని, తాను సిగ్గు పడుతున్నానని అన్నారు ప్రముఖ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ. నాకు మాట్లాడటం రావడం లేదు.
ఇది పూర్తిగా చెప్పుకోలేని సన్నివేశం. ఈ దేశం ఎటు పోతోంది. దేని కోసం ఇలా జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది. ఇంత అన్యాయం జరిగిన సమాజం నిశ్శబ్దంగా ఉండడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు షబానా ఆజ్మీ(Shabana Azmi).
ఆమె కోసం మనం పోరాడక పోతే ఇక స్వేచ్ఛ ఉన్నట్టు ఎలా అనుకోవాలని ప్రశ్నించింది నటి.
Also Read : రోడ్డు ప్రమాదంలో పంజాబీ సింగర్ మృతి