Shane Bond : ఎంఐ ఎమిరేట్స్ హెడ్ కోచ్ గా షేన్ బాండ్
కీలక నిర్ణయం తీసుకున్న మేనేజ్ మెంట్
Shane Bond : ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ గ్రూప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా ఐపీఎల్ లో సత్తా చాటి పలుసార్లు చాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం గత కొంత కాలంగా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది.
గుజరాత్ టైటాన్స టైటిల్ గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ రన్నరప్ గా నిలిచింది. ఇక మహేళ జయవర్దనేను హెడ్ కోచ్ గా తప్పించింది. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం మార్క్ బౌచర్ ను ఎంపిక చేసింది.
తాజాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కు కోచ్ గా పని చేస్తున్న షేన్ బాండ్(Shane Bond) ను ఎంఐ ఎమిరేట్స్ కు హెడ్ కోచ్ గా శనివారం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అధికారికంగా వెల్లడించింది.
ఇక కోచింగ్ టీమ్ లో ప్రస్తుత ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్స్ పార్థివ్ పటేల్ , వినయ్ కుమార్ కోచ్ లుగా అరంగేట్రం చేయనున్నారు.
పార్థివ్ పటేల్ బ్యాటింగ్ కోచ్ గా , వినయ్ కుమార్ బౌలింగ్ కోచ్ గా, మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నారు. ఇక అదనంగా రాబిన్ సింగ్ ఎంఐ ఎమిరేట్స్ క్రికెట్ జనరల్ మేనేజర్ గా ఉంటారు.
ఇదిలా ఉండగా షేన్ బాంబ్ 2015లో ముంబై ఇండియన్స్ లో చేరాడు. అప్పటి నుండి 4 టైటిళ్లను గెలుచుకున్నాడు. రాబిన్ సింగ్ 2010లో ముంబై ఇండియన్స్ కోచింగ్ టీంలో చేరాడు. షేన్ బాండ్(Shane Bond) తో కలిసి ని చేశాడు.
Also Read : ఏదో ఒక రోజు జాతీయ జట్టులోకి వస్తా – శాంసన్