Shane Watson : ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ , రాజస్తాన్ రాయల్స్ మధ్య ఆఖరు ఓవర్ (20) లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 19వ ఓవర్ ను ప్రసిద్ద్ కృష్ణ మెయిడెన్ ఓవర్ వేశాడు.
ఈ ఓవర్ లో కీలకమైన కుల్దీప్ యాదవ్ వికెట్ ను తీసుకున్నాడు. ఈ తరుణంలో 20వ ఓవర్ లో 36 పరుగులు చేయాల్సి ఉండగా ఓడెమ్ మెక్ కామ్ వేశాడు. మూడు బంతుల్ని పావెల్ మూడు సిక్సర్లు కొట్టాడు.
కానీ బ్యాట్ పై మూడో బంతి వెళ్లిందని అభ్యంతరం వ్యక్తం చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ , కోచ్ ప్రవీణ్ ఆమ్రే. ఈ మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
ఈ నిర్ణయాన్ని వారు తప్పు పట్టారు. మూడో అంపైర్ రివ్యూ కోసం వెళ్లలేక పోయారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం నో బాల్ ఇచ్చే విషయంపై పూర్తి సర్వాధికారం మైదానంలో ఉన్న అంపైర్ కు ఉంటుంది.
మూడో అంపైర్ కు ఆ అధికారం ఉండదు. ఈ వివాదాస్పద అంశంపై స్పందించాడు షేన్ వాట్సన్(Shane Watson). ఆటను నియంత్రించేది అంపైర్లేనని , ఏది ఆమోద యోగ్యం కాదో నిర్ణయం తీసుకునేది అంపైర్ పై ఉంటుందన్నాడు కుమార సంగక్కర.
షేన్ వాట్సాన్ కూడా సంగక్కర మాటలతో ఏకీభవించాడు. ఇదిలా ఉండగా రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్లు కోల్పోయి 222 రన్స్ చేస్తే ఢిల్లీ 207 పరుగులు చేసింది.
Also Read : జోస్ బట్లర్ పడిక్కల్ సయ్యాట