Air India Shankar Mishra : శంకర్ మిశ్రాపై నాలుగు నెలలు వేటు
ఎయిర్ ఇండియాలో జర్నీపై నిషేధం
Air India Shankar Mishra : వృద్దురాలిపై మూత్రం పోసిన ఘటనలో కీలకంగా ఉన్న శంకర్ మిశ్రాకు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ కు భంగం వాటిల్లేలా చేసినందుకు, పరువు తీసినందుకు గాను కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా(Air India Shankar Mishra) నాలుగు నెలల పాటు జర్నీ చేయకుండా నిషేధం విధించింది.
శంకర్ మిశ్రా ఎక్కడికైనా వెళ్లలేరు. ఆయన పని చేస్తున్న కంపెనీ నుంచి తొలగించబడ్డాడు. అనూహ్యంగా పోలీసులు బెంగళూరులో పట్టుకున్నారు శంకర్ మిశ్రా. న్యూయార్క్ – న్యూఢిల్లీ ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్ లో ఒక వృద్ద మహిళ తనపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపించింది.
ఇందుకు సంబంధించి ఆమె బాధతో ఏకంగా ఎయిర్ ఇండియా సంస్థ సిఇఓకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన ఎయిర్ ఇండియా నలుగురు సిబ్బందిని తొలగించింది. ఈ మూత్ర విసర్జన అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది.
శంకర్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో శంకర్ మిశ్రాను జనవరి 4న అరెస్ట్ చేశారు. అయితే మనోడు మాట మార్చాడు. తాను ఆ మహిళపై మూత్రం చేయలేదని , ఆమె తనపైన మూత్రం చేసిందంటూ ఆరోపించారు. చివరకు ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఏకంగా నాలుగు నెలల పాటు నిషేధం విధించడం మిగతా ప్రయాణీకులకు హెచ్చరికగా పేర్కొంది ఎయిర్ ఇండియా.
Also Read : నాకో తిక్కుంది దానికో లెక్కుంది