Shankar Mishra Removed : ‘మూత్రం’ ఘటనలో మిశ్రాపై వేటు
ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ
Shankar Mishra Removed : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది ఎయిర్ ఇండియాలో ఓ మహిళపై మూత్రం పోసిన వ్యవహారం. ఇందుకు సంబంధించి కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న శంకర్ మిశ్రాకు(Shankar Mishra) కోలుకోలేని షాక్ ఇచ్చింది తను పని చేస్తున్న కంపెనీ. ఇప్పటికే ఎయిర్ ఇండియా దీనిపై చర్యలు చేపట్టింది. శంకర్ మిశ్రాను 30 రోజుల పాటు ప్రయాణించకుండా నిషేధం విధించింది.
ఇదే సమయంలో మూత్ర విసర్జన ఘటనకు సంబంధించి చర్చకు దారి తీయడంతో సీరియస్ గా తీసుకుంది కంపెనీ. ఈ మేరకు శంకర్ మిశ్రాను తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. శంకర్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయని కంపెనీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.
ఇదిలా ఉండగా శంకర్ మిశ్రా(Shankar Mishra) నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానంలో వృద్ద మహిళపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపించారు. దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ సిఇఓ చంద్రశేఖరన్ కు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేంద్ర సర్కార్ కూడా సీరియస్ అయ్యింది.
ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కోరుతూ డీజీసీఏ నోటీసు జారీ చేసింది. ఇదిలా ఉండగా శంకర్ మిశ్రాను తొలగించినట్లు వెల్స్ ఫార్గో కంపెనీ స్పష్టం చేసింది. ఇక నుంచి తమకు ఆయనతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
ఇప్పటికే ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రత్యేకించి ప్రయాణికుల పట్ల సానుకూల ధోరణితో ఉండాలని సూచించింది.
Also Read : ‘టాయిలెట్ పేపర్స్’ మీదే బాధ్యత