Shantanu Naidu : శంత‌న్ నాయుడు ర‌త‌న్ టాటా బెస్ట్ ఫ్రెండ్

ఎవ‌రీ శంత‌ను ఏమిటా గెలుపు క‌థ

Shantanu Naidu :  భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం ర‌త‌న్ టాటా(Ratan TATA) మెచ్చిన కుర్రాడే ఈ శంత‌ను నాయుడు. టాటాకు అసిస్టెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అంతేనా ఇవాళ ఒకే ఒక్క ఆలోచ‌న‌తో కూడిన స్టార్ట‌ప్ రూపొందించ‌డంతో భార‌తీయ స్టార్ (తార‌)గా వెలుగొందాడు.

ఎంతో మంది ఎవ‌రీ యువ‌కుడు, అత‌డి వెనుక ఉన్న క‌థేంటి అంటూ వెదుకుతున్నారు. ప్ర‌పంచంలో ఎన్నో ఆలోచ‌న‌ల‌తో స‌త‌మ‌తం అయ్యే వారు ఎంద‌రో. కానీ కొంద‌రే క‌ల‌ల‌కు, ఆలోచ‌న‌ల‌కు రెక్క‌లు తొడుగుతారు.

వాటిని ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు వ‌స్తారు. వృద్దుల‌తో యువ‌కులు క‌లిసి సాయం చేస్తే, వారి ఆనందంలో, సుఖంలో, దుఖఃంలో పాలు పంచుకుంటే ఎలా

ఉంటుందోన‌న్న ఆలోచ‌నే గుడ్ ఫెలో స్టార్ట‌ప్. దీనిని రూపొందించాడు శంత‌ను నాయుడు(Shantanu Naidu) .

కోట్లాది మందికి స్పూర్తిగా నిలిచిన వ్యాపార దిగ్గ‌జం త‌న స్నేహితుడిగా పేర్కొన్నారు ఈ యువ‌కుడిని. శంత‌ను నాయుడు ర‌త‌న్ టాటాస్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ మాత్ర‌మే కాదు, ఆయ‌న‌కు స‌హాయ‌కుడు కూడా.

సామాజిక కార్య‌క‌ర్త‌, జంతు ప్రేమికుడు, ర‌చ‌యిత‌, యువ ఫౌండ‌ర్ . సుప్రసిద్ద ర‌చ‌యితల్లో ఒక‌డిగా ఉన్నాడు. ప్ర‌జ‌లు అత‌డిని ఆప్యాయంగా టాటా

అసిస్టెంట్ అని కూడా ప్రేమ‌గా పిలుస్తారు.

ఇద్ద‌రూ రోజూ చ‌ర్చిస్తారు. మాట్లాడుకుంటారు. వివిధ అంశాల గురించి ప్ర‌స్తావిస్తారు. శంత‌ను నాయుడు జీవితానికి కొత్త అర్థాన్ని వివ‌రంచ‌డం ద్వారా స‌మాజంలో సానుకూల మార్పు తీసుకొచ్చిన రోల్ మోడ‌ల్ గా నిలిచారు.

1993లో పూణెలోని తెలుగు కుటుంబంలో పుట్టాడు. 28 ఏళ్ల వ‌య‌స్సులో వ్యాపార ప్ర‌పంచంలోకి అడుగు పెట్టాడు. యువ సాధ‌కుడు. సున్నిత‌మైన మ‌న‌స్త‌త్వం అత‌డి సొంతం.

అత‌డు సాధించిన విజ‌యాలు ప్ర‌శంస‌నీయ‌మైన‌వి. మాట్లాడ‌ద‌గిన‌వి కూడా. మోటోపాస్ అనే విద్యార్థి సంస్థ‌లో భాగ‌మయ్యాడు. వీధి కుక్క‌లకు సాయం చేస్తుంది ఈ సంస్థ‌.

చాలా కుక్క‌ల‌ను ర‌క్షించాడు. అత‌డు వాటిని ఎలా కాపాడు కోవాలో చెబుతూ ఓ వ్యాసం రాశాడు. అది ర‌త‌న్ టాటా దృష్టిలో ప‌డింది. ముంబైకి ర‌మ్మంటూ లేఖ పంపించాడు టాటా. ఏకంగా శంత‌ను నాయుడు కంపెనీలో ప్ర‌ముఖ స్థానం సంపాదించాడు.

సోష‌ల్ మీడియాను ప్ర‌భావితం చేస్తూ వుంటాడు. నేను లైట్ హౌస్ కి వ‌చ్చాను అనే పుస్త‌కాన్ని రాశాడు. పూణే యూనివ‌ర్శిటీలో మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్

చేశాడు. 2016లో కార్నెల్ యూనివ‌ర్శిటీ నుండి ఎంబీఏ చేశాడు.

ఎన్నో అవార్డులు పొందాడు. హెమ్మీట‌ర్ ఎంట‌ర్ ప్రెన్యూర్ షిప్ అవార్డు పొందాడు. జాన్స‌న్ లీడ‌ర్ షిప్ పోటీలో విజేత‌. జాన్స‌న్ సోష‌ల్ మీడియా

అంబాసిడ‌ర్ , ది కార్నెల్ మోటార్ సైకిల్ అసోసియేష‌న్ ఫౌండ‌ర్ . ది కార్నెల్ బిజినెస్ జ‌ర్న‌ల్ ర‌చ‌యిత‌.

టెక్ క్ల‌బ్ క‌న్స‌ల్టెంట్ , జాన్స‌న్ పెంపుడు జంతువుల అధ్యక్షుడు. సౌత్ ఏషియ‌య‌న్ బిజినెస్ అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు శంత‌ను నాయుడు(Shantanu Naidu) . ఈ యువ‌కుడిని చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది క‌దూ.

Also Read : గుడ్ ఫెలోస్ కు ర‌తన్ టాటా భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!