Sharad Pawar : ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ నిప్పులు చెరిగారు. కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్ చేశారు. ఈ దేశంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లందన్నారు. పనిగట్టుకుని కొందరినే టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు.
కుల, మతాలు, వర్గాల పేరుతో చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునేందుకు కొన్ని శక్తులు యత్నిస్తున్నాయంటూ ఆరోపించారు. ప్రధానంగా ఢిల్లీ వేదికగా జరిగిన మత పరమైన అల్లర్లను కంట్రోల్ చేయడంలో అమిత్ షా పూర్తిగా విఫలమయ్యారంటూ విమర్శించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఇరు వర్గాలు కొట్టుకునేంత దాకా వెళ్లాయని, అసలు ఏం జరిగిందనే విషయం ఈరోజు వరకు తెలియ లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం అల్లర్లను కంట్రోల్ చేయక పోతే ఎలా అని ప్రశ్నించారు. కొల్హాపూర్ లో జరిగిన బహిరంగ సభలో పవార్ ప్రసంగించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించు కోవడం లేదని, బీజేపీయేతర రాష్ట్రాలు, సంస్థలు, వ్యక్తుల్ని టార్గెట్ చేయడం పెట్టుకుందంటూ ధ్వజమెత్తారు.
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఏదో ఒక ఇష్యూ తీసుకు రావడం , అల్లర్లు సృష్టించడం పనిగా పెట్టుకుందంటూ సంచలన ఆరోపణలు చేశారు శరద్ పవార్(Sharad Pawar).
శాంతి భద్రతలకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఉండదని ఒకవేళ ఉండి ఉంటే ఈపాటికి నియంత్రించే వారని చెప్పారు.
జహంగీర్ పూర్ లో హింస జరుగుతుంటే అమిత్ షా నిద్ర పోతున్నారా అంటూ నిలదీశారు. రాజకీయం చేయడం తప్ప పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందారంటూ ఆరోపించారు.
Also Read : కోర్టులో ఆశిష్ మిశ్రా సరెండర్