Sharmila Congress : షర్మిల ఏపీసీసీ చీఫ్ కానుందా..?
గందరగోళంగా మారిన ఏపీ రాజకీయాలు
Sharmila : షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుంది అన్నారు మాణిక్కం ఠాకూర్. షర్మిలకు ఏ పదవి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
ఇక చుస్తే కాంగ్రెస్ ఏపీ మిషన్ ప్రారంభం అయింది. ఏపీలోని ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి అనుకూలమే అన్నారు, ఏపీకి బీజేపీ తీరని ద్రోహం చేసిందన్నారు మాణిక్కం ఠాకూర్. ఏపీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ కీలక భేటీ అనంతరం ఇలా కామెంట్స్ చేసారు మాణిక్కం ఠాకూర్.
Sharmila role in Congress- By Manickam Thakur
“షర్మిల(YS Sharmila) గారు శ్రీ ఖర్గే మరియు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆమె శ్రీమతి సోనియా గాంధీను కూడా కలిశారు. తాను చేరిన సందర్భంగా ప్రసంగించినట్లుగానే, రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేసేందుకు, వైయస్ఆర్ కలను నెరవేర్చేందుకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు.
ఆమెను కాంగ్రెస్ కుటుంబానికి అందరం స్వాగతిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబానికి చెందినవారని, షర్మిల కాంగ్రెస్‌లో చేరతారని మేమంతా విశ్వసించాము. ఆమె కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమైన మనిషిగా ఆమె పదవి గురించి కాంగ్రెస్ అధ్యక్షులు నిర్ణయిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇప్పటికే మా దృష్టి ఆంధ్రప్రదేశ్‌పై ఉంది. మేము చాలా స్పష్టంగా ఉన్నాము. కాంగ్రెస్ మిషన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తున్నందున కాంగ్రెస్ మిషన్ ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమవుతుంది”.
Gidugu Rudraraju Comments
ఇదే సమయంలో ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీసీసీ చీఫ్ ని మార్చిన ఇబ్బంది ఏం లేదన్నారు. పదవులు ముఖ్యం కాదు కార్యకర్తగా పనిచేస్తానన్నారు, రాష్ట్రంలో వైసీపీని కేంద్రంలో బీజేపీని ఓడించటమే తమ లక్ష్యం అన్నారు. షర్మిలతో కలిసి టీంగా పనిచేస్తామన్నారు గిడుగు రుద్రరాజు.
Also Read : Telangana Govt : హైదరాబాద్ చుట్టూ సాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామన్న రేవంత్ సర్కార్