Shashi Tharoor : స‌ల్మాన్ ర‌ష్డీపై దాడి బాధాక‌రం – థ‌రూర్

భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు తీవ్ర భంగం

Shashi Tharoor : న్యూయార్క్ వేదిక‌గా ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో 75 ఏళ్ల ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌ల్మాన్ ర‌ష్డీపై దాడి జ‌రిగింది. ఆయ‌న‌పై ఇరాన్ మ‌త గురువు ఆయ‌తుల్లా ఖొమేనీ 33 ఏళ్ల కింద‌ట 1989లో ఫ‌త్వా జారీ చేశాడు.

ర‌ష్డీ త‌ల తీసుకు వ‌స్తే భారీ బ‌హుమ‌తి ప్ర‌కటించాడు. ఆనాటి నుంచి నేటి దాకా ర‌ష్డీ సాధార‌ణ జీవితం గ‌డుపుతూ వ‌చ్చాడు. ఆయ‌న భార‌త్ కు చెందిన వ్య‌క్తి. ది శాట‌నిక్ వ‌ర్సెస్ అనే పేరుతో పుస్త‌కం రాశాడు.

అది అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. ప్ర‌ధానంగా ఇస్లాం మతాన్ని, మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ను కించ ప‌రిచేలా వ్యాఖ్య‌లు ఉన్నాయి. దీనిని పెంగ్విన్ ప్ర‌చురణ సంస్థ ప్ర‌చురించింది. విడుద‌లైన త‌ర్వాత పుస్త‌కాలు పెద్ద ఎత్తున అమ్ముడు పోయాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ల్మాన్ ర‌ష్డీ పేరు మారుమ్రోగింది. ఈ సంద‌ర్భంగా స‌ల్మాన్ ర‌ష్డీపై దాడిని తీవ్రంగా ఖండించారు ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor).

ఇవాళ ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఇది త‌న‌ను బాధ‌కు గురి చేసిందంటూ పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ర‌ష్డీ ర‌చించిన మిడ్ నైట్స్ చిల్డ్ర‌న్ ను గుర్తు చేశారు శ‌శి థ‌రూర్.

సృజ‌నాత్మ‌క వ్య‌క్తీక‌ర‌ణ ఇక‌పై స్వేచ్ఛ‌గా , బ‌హిరంగంగా ఉండ‌క పోతే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించారు. ఇదిలా ఉండ‌గా 1988లో విడుద‌లైన ఆ పుస్త‌కాన్ని కొంద‌రు మ‌త పెద్ద‌లు ప్ర‌వ‌క్త మ‌హ్మ‌ద్ కు భంగం వాటిల్లేలా ఉంద‌ని భావించారు.

ఇది ఎవ‌రూ ఊహించ‌ని దాడి. త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor).

Also Read : స్టార్ట‌ప్ ఎకో సిస్ట‌మ్ లో 3వ ప్లేస్ లో భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!