Shashi Tharoor : శశి థరూర్ కామెంట్స్ కలకలం
పోటీ చేసే విషయంపై ఆలోచిస్తా
Shashi Tharoor : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో రోజుకో షాక్ తగులుతోంది. ఇప్పటికే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గుడ్ బై చెప్పారు.
మంగళవారం మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రులు 50 మందికి పైగా ఆజాద్(Ghulam Nabi Azad) కు మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మరో వైపు పార్టీలో అసమ్మతి రాగం వినిపిస్తూ వచ్చిన జి23లో కీలక నాయకుడిగా ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సైతం బాంబు పేల్చారు. పార్టీకి సంబంధించి తాను కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాతృభూమి పత్రికలో ఓ వ్యాసం రాశారు. ప్రస్తుతం ఇది కలకలం రేపుతోంది. ఇక సీడబ్యూసీ కార్యవర్గానికి సంబంధించి ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్నాయి.
అదే నెల 19న ఎన్నికల ఫలితం ప్రకటిస్తారు. పార్టీలో రెండు వర్గాలుగా చీలి పోయాయి. ఒక వర్గం గాంధీ ఫ్యామిలీకి మద్దతు ఇస్తుండగా మరో కూటమి గాంధీయేతర వ్యక్తులకు కీలక పదవులు ఇవ్వాలని పట్టు పడుతున్నాయి.
ఈ తరుణంలో శశి థరూర్(Shashi Tharoor) అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అశోక్ గెహ్లాట్ , మల్లికార్జున ఖర్గే పేర్లు వినిపించాయి. కానీ మెజారిటీ నేతలు మాత్రం రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ కావాలని కోరుతున్నారు.
పార్టీ చీఫ్ పదవికి జరిపే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని కోరారు. అంటే అర్థం తాను కూడా బరిలో ఉన్నట్లు అని. ఇందులో ఎలాంటి అనుమానం లేదంటున్నారు ఆయన అనుచరులు.
Also Read : ఆజాద్ కు మద్దతుగా పలువురు గుడ్ బై