Shashi Tharoor : ఆస్వాదించాలే తప్పా బహిష్కరిస్తే ఎలా
కేరళ క్రీడా శాఖ మంత్రిపై కామెంట్స్
Shashi Tharoor : కేరళ లోని తిరువనంతపురంలో భారత్ , శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ ముగిసింది. భారత జట్టు అత్యధిక పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తక్కువ సంఖ్యలో స్టేడియంకు హాజరయ్యారు. దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. దీనిపై సీరియస్ గా స్పందించారు ఎంపీ శశి థరూర్(Shashi Tharoor).
క్రికెట్ అభిమానిగా, స్థానిక ఎంపీగా తాను తిరువనంతపురంలో టాప్ క్లాస్ క్రికెట్ వర్ధిల్లాలని మాత్రమే కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఆఖరి వన్డే మ్యాచ్ లో టీమిండియా దుమ్ము రేపింది. రికార్డులు బద్దలు కొట్టింది. బహిష్కరణ ప్రచారంపై తాను చేసిన వ్యాఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.
ఆటను ఆస్వాదించాలే తప్పా బహిష్కరించ కూడదని అన్నారు శశి థరూర్. ఎవరికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామో వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆటను బహిష్కరించడం వల్ల తిరువనంతపురంలో క్రికెట్ అవకాశాలను దెబ్బ తీస్తుందన్న విషయం అర్థం చేసుకోవాలన్నారు.
అధిక టిక్కెట్ ధరలపై వచ్చిన ఫిర్యాదులపై వెనక్కి తగ్గారు కేరళ క్రీడా శాఖ మంత్రి వి. అబ్దుర్ రహిమాన్. ఆర్థిక స్థోమత లేని వారు మ్యాచ్ కు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేయడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా మ్యాచ్ ను వీక్షించేందుదకు స్టేడియంలోకి వెళ్లారు.
ఇదిలా ఉండగా శబరిమల తీర్థ యాత్ర సీజన్ , పొంగల్ పండుగ , కొన్ని ఇతర కారణాల వల్ల స్టేడియంకు ప్రేక్షకులు హాజరు కాలేక పోయారని కేరళ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.
Also Read : ఆస్పత్రిలో చేరిన లలిత్ మోడీ