Shashi Tharoor : ఓటమి పాలైనా చెరగని ముద్ర
హ్యాట్సాఫ్ శశి థరూర్ ఎఫర్ట్స్
Shashi Tharoor : 137 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో 24 ఏళ్ల అనంతరం గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మల్లికార్జున్ ఖర్గే. గత కొంత కాలంగా పడుతూ లేస్తూ వస్తున్న పార్టీకి శాశ్వత చీఫ్ ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. చివరకు ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందో లేదోనన్న ఉత్కంఠ కు తెర దించారు పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ.
ఇదంతా ఒక వైపు మాత్రమే. కానీ మరో వైపు ముందు నుంచీ ఎంతో అపారమైన అనుభవం కలిగిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పలుసార్లు
ప్రశ్నలను లేవదిస్తూ వచ్చారు. ఒక రకంగా పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం అని రాచరికం కాదని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ఆయన ముమ్మాటికీ విజయం సాధించారు.
పోటీ అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ ఎలాంటి గాంధీ కుటుంబం సపోర్ట్ గనుక లేక పోయి ఉండి ఉంటే పోటీ ఖర్గే, శశి థరూర మధ్య మరింత
రసవత్తరంగా మారేది. పార్టీపై ఎంతో పట్టు కలిగి ఉన్నప్పటికీ 1,000 ఓట్లకు పైగా సాధించారు శశి థరూర్(Shashi Tharoor). ఇది మూమాలు విషయం కాదు.
ఒక రకంగా చెప్పాలంటే అసమ్మతి గొంతుకు బలం చేకూర్చినట్లయింది ఈ పోలైన ఓట్లు . అందుకే ఫలితం వచ్చిన వెంటనే శశి థరూర్ ట్వీట్ చేశాడు. తనను నమ్మి ఓటు వేసిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియ చేస్తున్నా. ఇదే సమయంలో మీ అందరి తరపున మళ్లీ గొంతు వినిపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో అసమ్మతి అనేది లేక పోతే దానికి అర్థమే లేదంటారు శశి థరూర్. నిజం కూడా అసలైన ప్రతిపక్షం అన్నది ఉండాల్సిందే. లేక పోతే
అది డెమోక్రసీ అనబడదు. హీపోక్రసీకి అనార్కిజానికి వేదిక అవుతుంది.
ఏది ఏమైనా శశి థరూర్ ఇవాళ ఓడి పోయి ఉండవచ్చు గాక కానీ ఎప్పటికీ పార్టీలో తన చరిష్మాను మాత్రం అలాగే ఉంటుందని చెప్పక తప్పదు. ఒంటరి
పోరాటం థరూర్ ను ప్రత్యేకమైన నాయకుడిగా నిలిచేలా చేసింది. హ్యాట్సాఫ్ యూ శశి థరూర్.
Also Read : ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కోటి దండాలు