Shashi Tharoor : శశి థరూర్ షోయబ్ అక్తర్ వైరల్
విమానంలో ఎంపీకి పలకరింపు
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ పాపులర్ నాయకుడిగా గుర్తింపు పొందారు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్. ఆయన కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నారు. రచయిత, వక్త, విశ్లేషకుడు, పొలిటిక్స్ లో చేయి తిరిగిన నేతగా పేరొందారు. ఆయన రాసే పదాలు చాలా గొప్పగా ఉంటాయి. ఒకప్పుడు భారత దేశ రాజకీయాలలో టాప్ లీడర్ గా ఉన్న దివంగత జైపాల్ రెడ్డికి ఆ పేరు ఉండేది. ఆయన కూడా ఎక్కడి నుంచో తీసుకు వచ్చిన పదాలను అర్థవంతంగా వాడే వారు. ఇప్పుడు ఇండియాలో ఆయన తర్వాత శశి థరూర్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన రచయితనే కాదు నిరంతర పాఠకుడు కూడా. విస్తృతంగా పుస్తకాలు చదువుతారు.
ఇదిలా ఉండగా తాజాగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. పని మీద ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) దుబాయ్ కు వెళ్లారు. ఇదే సమయంలో ఢిల్లీకి తిరిగి వస్తుండగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచ క్రికెట్ రంగంలో మోస్ట్ పాపులర్ ఫాస్ట్ బౌలర్ గా పేరు పొందిన , దాయాది పాకిస్తాన్ కు చెందిన షోయబ్ అక్తర్ ఎదురు పడ్డారు. ఆయనే స్వయంగా వచ్చి శశి థరూర్ ను గుర్తు పట్టారు.
ఆపై ఎలా ఉన్నారంటూ పలకరించారు. దీంతో ఆనందానికి లోనయ్యారు కాంగ్రెస్ ఎంపీ. ఈ సందర్భంగా అరుదైన ఫోటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. దేశాలకు కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ అన్నది శశి థరూర్ అభిమతం. ఇద్దరితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
Also Read : KTR Kakatiya Textile Park : కాకతీయ టెక్స్ టైల్ పార్క్ సిద్దం
