Shashi Tharoor Slams : బీసీసీఐపై శశి థరూర్ ఫైర్
తిరువనంతపురం లేక పోతే ఎలా
Shashi Tharoor Slams : ఈ ఏడాది భారత్ లో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 కి సంబంధించి షెడ్యూల్ ఖారరైంది. ఇందులో భాగంగా దేశంలోని పేరు పొందిన మైదానాలలో తిరువనంతపురం కూడా ఒకటి. ఈ నగారనికి ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శశి థరూర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆయన రాజకీయ నాయకుడే కాదు రచయిత, విశ్లేషకుడు, వక్త అంతకు మించి క్రికెట్ అంటే పంచ ప్రాణం. ఇదిలా ఉండగా అన్ని సౌకర్యాలు, వసతులు కలిగి ఉన్న తిరువనంతపురం స్టేడియంను ఎందుకు ఎంపిక చేయలేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు వేదికగా మారిందని ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా మంగళవారం నిప్పులు చెరిగారు.
ఐసీసీ మ్యాచ్ షెడ్యూల్ జాబితా నుంచి లేక పోవడాన్ని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ శశి థరూర్(Shashi Tharoor). ఇప్పటి వరకు తిరువనంతపురం లో ఏర్పాటు చేసిన స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ లు ఎన్నో జరిగాయని పేర్కొన్నారు.
ఎందుకని బీసీసీఐ పట్టించు కోలేదని నిలదీశారు శశి థరూర్. కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా తనయుడు జే షా సెక్రటరీ నిర్వాకం వల్లనే అహ్మదాబాద్ లో మ్యాచ్ లు ఏర్పాటు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : IND vs PAK ICC World Cup : అక్టోబర్ 15న భారత్, పాక్ మ్యాచ్
