Shashi Tharoor : బీసీసీఐపై శశి థరూర్ ఫైర్
సంజూ శాంసన్ , చాహల్ పై కామెంట్
Shashi Tharoor : స్వదేశంలో ఆసిస్ తో జరిగే టి20 5 మ్యాచ్ ల సీరీస్ కు కేరళ స్టార్ సంజూ శాంసన్ తో పాటు ముంబై ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ను ఎంపిక చేయక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్.
Shashi Tharoor Serious Comments on BCCI
ఆయన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని ఏకి పారేశాడు. కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జే షా కార్యదర్శిగా ఉండడం వల్లనే పనిగట్టుకుని ఇద్దరి ఆటగాళ్లపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.
ఆటగాళ్ల ఎంపిక ఇవాళ పూర్తిగా రాజకీయ పరంగా మారి పోయిందని దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు శశి థరూర్(Shashi Tharoor). కేరళ జట్టు కెప్టెన్ గా, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ గా అపారమైన అనుభవం సంజూ శాంసన్ కు ఉందని స్పష్టం చేశాడు.
వన్డే చరిత్రలో సూర్య కుమార్ యాదవ్ కంటే మెరుగైన స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడని అయినా సంజూను పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు శశి థరూర్. మొత్తంగా కాంగ్రెస్ ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Eatala Rajender : దొర పాలన దోపిడీకి ఆలంబన