Shashi Tharoor : అశోక్ గెహ్లాట్ పై శ‌శి థ‌రూర్ క‌న్నెర్ర‌

మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు మ‌ద్ద‌తుపై ఫైర్

Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. బ‌రిలో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో పాటు శ‌శి థ‌రూర్(Shashi Tharoor) ఉన్నారు. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగుతోంది. సుదీర్గ కాలం త‌ర్వాత గాంధీయేత‌ర వ్య‌క్తులలో ఒక‌రు 134 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడిగా ఎన్నిక కాబోతున్నారు.

ప్ర‌స్తుతం గాంధీ కుటుంబానికి గాంధీయేత‌ర వ్య‌క్తులుగా పోటీ మారి పోయింది. మొద‌ట ఏక‌గ్రీవంగా ఎన్నుకోవాల‌ని అనుకున్నారు. కానీ జి23 అస‌మ్మ‌తి టీంలో ఒక‌రిగా ఉన్న తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ ఎంట్రీ ఇవ్వ‌డంతో సీన్ ఒక్క‌సారిగా మారి పోయింది. మొద‌ట రాహుల్ గాంధీ పేరు వినిపించింది.

అయితే గాంధీ ఫ్యామిలీ త‌మ‌కు వ‌ద్దంటూ ప్ర‌క‌టించ‌డంతో పోటీ అనివార్యంగా మారింది. ఈ త‌రుణంలో మొద‌టగా రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తో పాటు మ‌ధ్య ప్ర‌దేశ్ మాజీ సీఎంలు క‌మ‌ల్ నాథ్, దిగ్విజ‌య్ సింగ్ పేర్లు వినిపించాయి. కానీ చివ‌ర‌కు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే పేరు ఖ‌రారు చేసింది.

ఆయ‌న‌కు సోనియా గాంధీ మ‌ద్ద‌తు ఉన్న‌మాట బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఇదిలా ఉండ‌గా ఎన్నిక పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాల‌ని ముందు నుంచీ కోరుతున్నారు ఎంపీ శ‌శి థ‌రూర్. ఆయ‌న ప‌దే ప‌దే దీనిని హైలెట్ చేస్తూ వ‌స్తున్నారు. త‌న ప‌ట్ల ఒక ర‌కంగా ఖ‌ర్గే ప‌ట్ల మ‌రో ర‌కంగా చూస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ త‌రుణంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఖ‌ర్గేకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌పై భ‌గ్గుమ‌న్నారు శ‌శి థ‌రూర్. సీనియ‌ర్ నాయ‌కుడిగా ఇది త‌గ‌ద‌న్నారు.

Also Read : జీఎన్ సాయిబాబ విడుద‌ల‌పై విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!