Sheejan Khan Tunisha Case : ఇంటి భోజనం కావాలంటున్న షీజాన్
తునీషా శర్మ కేసులో నిందితుడు ఖాన్
Sheejan Khan Tunisha Case : యువ నటి తునీషా శర్మ హత్య కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆమెను సహ నటుడు షీజాన్ ఖాన్ ఒత్తిడికి గురి చేసి చంపేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది యువ నటి తల్లి వనితా శర్మ. అతడికి శిక్ష పడేంత దాకా తాను నిద్ర పోనంటూ శపథం చేశారు.
ఆపై పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, డ్రగ్స్ కు కూడా బానిస అయ్యాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా ఈ కేసు చాలా ప్రాముఖ్యత కలిగినదని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు తునీషా శర్మ(Tunisha Sharma Case) కేసు ఎఫ్ఐఆర్ లో ఆత్మహత్య లేదా హత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా యువ నటి డిసెంబర్ 24న సీరియస్ సెట్ లో ఆత్మహత్యకు పాల్పడింది. 25న ఆదివారం ఉదయం కో స్టార్ షీజాన్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పర్చారు. కోర్టు అతడికి నాలుగు రోజుల కస్టడీ విధించింది. అయితే విచారణ సమయంలో తలతిక్కగా సమాధానాలు చెబుతున్నాడని , ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వడం లేదంటూ స్పష్టం చేశారు పోలీసులు.
ఈ మేరకు మరోసారి కోర్టుకు హాజరు పర్చిన పోలీసులు కస్టడీ పొడిగించాలని కోరారు. పరిస్థితిని గమనించిన కోర్టు న్యాయమూర్తి రెండు రోజుల కస్టడీకి ఓకే చెప్పారు. విచిత్రం ఏమిటంటే శనివారం విచారణలో భాగంగా షీజన్ ఖాన్(Sheejan Khan) ఏకంగా తనకు ఇంటి నుంచి వచ్చే భోజనం కావాలని డిమాండ్ చేయడం విస్తు పోయేలా చేసింది.
Also Read : షీజాన్ కు శిక్ష పడే దాకా ఊరుకోను