Sheezan Khan Bail : షీజ‌న్ ఖాన్ బెయిల్ వాయిదా

యువ న‌టి తునీషా శ‌ర్మ కేసు

Sheezan Khan Bail : యువ న‌టి తునీషా శ‌ర్మ ఆత్మ‌హ‌త్య కేసులో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌హ న‌టుడు షీజ‌న్ ఖాన్ బెయిల్(Sheezan Khan Bail)  కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి విచార‌ణ చేప‌ట్టిన కోర్టు వాయిదా వేసింది. అలీ బాబా ద‌స్తాన్ ఎ కాబుల్ షోలో న‌టించిన తునీషా శ‌ర్మ గ‌త ఏడాది 2022 డిసెంబ‌ర్ 24న సీరియ‌స్ సెట్ లో ఉండ‌గా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

షీజ‌న్ ఖాన్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డేలా చేశాడంటూ ఆరోప‌ణ‌లు చేశారు తునీషా శ‌ర్మ త‌ల్లి వనితా శ‌ర్మ‌. ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంతే కాదు పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించాడ‌ని, 15 రోజుల కింద‌ట త‌న కూతురుకు బ్రేక‌ప్ చెప్పాడ‌ని వాపోయారు. అంతే కాదు సీరియ‌ల్ సెట్ లో ఉండ‌గానే అంద‌రి ముందు తునీషా శ‌ర్మ చెంప‌పై చేయి చేసుకున్నాడ‌ని ఆరోపించారు.

షీజాన్ ఖాన్ పేరెంట్స్ త‌న కూతురిని మ‌తం మార్చుకోమంటూ ఒత్తిడి తెచ్చార‌ని మండిప‌డ్డారు. దీంతో డిసెంబ‌ర్ 25న షీజ‌న్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రు ప‌ర్చారు. నాలుగు రోజ‌ల క‌స్ట‌డీకి ఇచ్చింది. కానీ కేసుకు సంబంధించి ఎలాంటి వివ‌రాలు బ‌య‌ట పెట్ట‌క పోవ‌డంతో మ‌రో రెండు రోజులు క‌స్ట‌డీ ఇవ్వాల‌ని కోరారు పోలీసులు.

ఇదిలా ఉండ‌గా షీజ‌న్ ఖాన్ బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌ను మ‌హారాష్ట్ర లోని పాల్ఘ‌ర్ జిల్లాలోని కోర్టు జ‌న‌వ‌రి 9కి వాయిదా వేసింది. తునీషా శ‌ర్మ త‌ల్లి వ‌నితా శ‌ర్మ మ‌ర‌ణాంత‌ర కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నార‌ని, ఆమె వాంగ్మూలాన్ని న‌మోదు చేయలేక పోయామ‌ని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో బెయిల్ వాయిదా వేస్తున్న‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది.

Also Read : నాగ‌బాబు కామెంట్స్ రోజా సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!