Sherlyn Chopra Rahul : రాహుల్ ఓకే అంటే పెళ్లికి సిద్దం
నటి షెర్లీన్ చోప్రా షాకింగ్ కామెంట్స్
Sherlyn Chopra Rahul : నటి, మోడల్ షెర్లీన్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ఉన్నట్టుండి ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై మనసు పారేసుకున్నారు. మీకు ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు ఈ అమ్మడు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. తనకు రాహుల్ గాంధీ అంటే చచ్చేంత ఇష్టమని చెప్పింది. ఆయన గనుక ఓకే అంటే వెంటనే ఇప్పటికి ఇప్పుడే పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నానని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక షెర్లీన్ చోప్రా నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ వస్తారు.
Sherlyn Chopra Likes Rahul
ప్రస్తుతం రాహుల్ గాంధీపై చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మరారు. ఇక రాహుల్ ప్రస్తుతం బ్యాచ్ లర్ గా ఉన్నాడు. ఆయన ఆ మధ్యన ప్రేమలో పడినట్లు కూడా ప్రచారం జరిగింది. దానిని ఖండించారు. మరో వైపు ప్రతిపక్షాల కూటమి సందర్భంగా పాట్నాలో జరిగిన కీలక సమావేశంలో ఆర్జేడీ చీఫ్ , మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ రాహుల్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారంటూ అడిగారు. అమ్మాయిని చూడమంటే తాను చూస్తానని కానీ రాహుల్ ఓకే చెప్పాలని పేర్కొన్నారు. దీంతో అక్కడ ఉన్న నేతలంతా ఒక్కసారిగా నవ్వారు. మొత్తం మీద రాహుల్ గాంధీ మరోసారి వైరల్ గా మారడం విశేషం.
Also Read : Revanth VS Uttam : గాంధీ భవన్ లో రేవంత్ వర్సెస్ ఉత్తమ్