Shikhar Dhawan : గ్రాండ్ గా శిఖ‌ర్ ధావ‌న్ బ‌ర్త్ డే

ద్ర‌విడ్..టీమ్ మేట్స్ తో సెల‌బ్రేష‌న్స్

Shikhar Dhawan : వెట‌ర‌న్ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ త‌న 37వ పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నాడు. ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ టూర్ లో ఉన్నాడు. టీమిండియా వ‌న్డేల‌తో పాటు టెస్టు మ్యాచ్ లు ఆడ‌నుంది. ఈ వేడుక‌ల్లో హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ తో పాటు జ‌ట్టులోని స‌హ‌చ‌రుల‌తో క‌లిసి జ‌రుపుకున్నాడు.

ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఈ సందర్భంగా తాజా, మాజీ క్రికెట‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. బ్రియాన్ లారా కూడా ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వ‌త‌హాగా శిఖ‌ర్ ధావ‌న్ షేర్ చేశాడు.

కేక్ క‌ట్ చేశాడు. ఈ కార్య‌క్ర‌మంలో రాహుల్ ద్ర‌విడ్ తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్ కూడా ఉన్నాడు. మాజీ భారత క్రికెట‌ర్ మునాఫ్ ప‌టేల్ కూడా అభినందంచాడు శిఖ‌ర్ ధావ‌న్(Shikhar Dhawan)  కేవ‌లం 50 ఓవ‌ర్ల ఫార్మాట్ లో మాత్ర‌మే పాల్గొంటున్నాడు. అనేక సంద‌ర్భాల‌లో జ‌ట్టును న‌డిపించాడు. ఇటీవ‌ల ముగిసిన న్యూజిలాండ్ టూర్ లో జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. 0-1 తేడాతో భార‌త్ ఓట‌మి పాలైంది.

శిఖ‌ర్ ధావ‌న్ 2015, 2019 ప్ర‌పంచ క‌ప్ ల‌లో ఆడాడు. 10 మ్యాచ్ ల్లో 537 ర‌న్స్ చేశాడు. 2013లో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో కూడా అద్భుత‌మైన ఆటతీరును ప్ర‌ద‌ర్శించాడు. ఈసారి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది ధావ‌న్ కు.

Also Read : జేమ్స్ అండ‌ర్స‌న్ అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!