Shikhar Dhawan : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2022లో టాప్ రేంజ్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించింది పంజాబ్ కింగ్స్ . నిన్నటి దాకా ప్రత్యర్థులకు కొరకొరరాని కొయ్యగా మారిన గుజరాత్ పంజాబ్ తో తేలి పోయింది.
ఏ కోశాన పోరాట పటిమను ప్రదర్శించ లేక పోయింది. గుజరాత్ టైటాన్స్ ను ఒంటి చేత్తో శాసించాడు స్టార్ పేస్ బౌలర్ కగిసొ రబాడా. 4 ఓవర్లు మాత్రమే వేసి 4 కీలక వికెట్లు తీశాడు.
ఒక రకంగా గుజరాత్ టైటాన్స్ పతనాన్ని శాసించాడు. మిస్సైల్స్ లాంటి బంతులతో ఇబ్బంది పెట్టాడు. అతడి బౌలింగ్ లో ఆడేందుకు నానా తంటాలు పడ్డారు.
దీంతో గుజరాత్ 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఇక టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 145 రన్స్ చేసి జయకేతనం ఎగుర వేసింది.
ఈ తరుణంలో ప్రధానంగా చెప్పు కోవాల్సింది వెటరన్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan). గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 53 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.
ఇందులో 8 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. మొత్తం 62 పరుగులు చేసి ముఖ్య భూమిక పోషించాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు శిఖర్ ధావన్.
బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ సారి ఐపీఎల్ లో ఎప్పటి లాగానే తన బ్యాటింగ్ తో పని చెబుతున్నాడు. తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు ధావన్.
Also Read : పంజాబ్ భళా గుజరాత్ విల విల