Saamana Shinde : షిండే పదవి మూణ్ణళ్ల ముచ్చటే – సామ్నా
22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్
Saamana Shinde : శివసేన అధికార పత్రిక సామ్నా సంచలన వ్యాఖ్యలు చేసింది. శివసేనపై తిరుగుబాటు జెండా ఎగుర వేసి భారతీయ జనతా పార్టీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ షిండేతో పాటు వెళ్లిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎప్పుడైనా వారంతా బీజేపీలోకి జంప్ కావడం ఖాయమని జోష్యం చెప్పింది.
నమ్మించి మోసం చేయడంలో బీజేపీ ముందంజలో ఉంటుందని పేర్కొంది సామ్నా పత్రిక. శివసేన పార్టీకి చెందిన చీఫ్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సామ్నాకు గౌరవ సంపాదకుడిగా ఉన్నారు. ప్రస్తుతం సామ్నాలో చోటు చేసుకున్న ఈ కథనం మరాఠాలో కలకలం రేపుతోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పుడూ తమ పార్టీ పవర్ లో ఉండాలని అనుకుంటుందని కానీ ఇతరులకు ఆ ఛాన్స్ ఇవ్వరని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా తమ మీద ఆపరేషన్ ఆకర్ష్ చేసినట్లే షిండేకు(Saamana Shinde) కూడా ఆ షాక్ త్వరలోనే తప్పదని హెచ్చరించింది.
తమను మోసం చేసిన షిండే బీజేపీలో చేతిలో ఘోరమైన పరాభవం తప్పక లభిస్తుందని జోష్యం చెప్పింది సామ్నా. శివసేన పార్టీ ఎవరిది అనేది ఎన్నికల సంఘమో లేదా మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా చెబితే ప్రజలు వినిపించు కోరని పేర్కొంది. బాలా సాహెబ్ ఠాక్రే వారసత్వానికి ప్రతీక శివసేన. ఇంకొకరు దానిని పొందలేరని పేర్కొంది.
సూర్య చంద్రులు ఉన్నంత కాలం మరాఠా ప్రజలు శివసేనను తమ గుండెల్లో దాచుకుంటారని స్పష్టం చేసింది సామ్నా. ఇదిలా ఉండగా షిండేపై 22 మంది ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారని వారంతా నేడో రేపో బీజేపీలోకి జంప్ కావడం ఖాయమని జోష్యం చెప్పింది.
Also Read : జెట్ ఎయిర్‌వేస్ సిఇఓ కీలక కామెంట్స్