Shinzo Abe : షింజో దేశం కోల్పోయిన దిగ్గజం
జపాన్ కు కోలుకోలేని విషాదం
Shinzo Abe : తీవ్ర సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఆర్థిక లేమితో సతమతమవుతూ ఉన్న జపాన్ దేశాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేసిన షింజో అబే ఇక లేరు. ఆయన కాల్చివేతకు గురయ్యారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక శకం ముగిసింది. ఇదే సమయంలో జపాన్ కు ఉక్కు మనిషిగా చివరి దాకా ఉంటూ వచ్చారు. తన దేశం కోసం ఆయన పడ్డ తపన గొప్ప నాయకుడిగా మార్చేలా చేసింది.
తైవాన్ కు అండగా నిలబడ్డాడు. ఆపై ప్రపంచంతో సత్ సంబంధాలు నెలకొల్పాడు. శాంతిని కొనసాగించేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. యుద్దాన్ని నిరసిసించాడు.
ఏకపక్షంగా దాడులకు పాల్పడుతూ వస్తున్న చైనాను బేషరతుగా ఖండించాడు. అంతే కాదు ఎదిరించాడు. బహుషా ఇవాళ షింజో అంబే(Shinzo Abe) మృతితో చైనా ఊపిరి పీల్చుకుంటుందని అనుకోవాలి.
దేశాన్ని అన్ని రంగాలలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు షింజో అబే. ఆయన వ్యక్తిగా నుంచి అత్యున్నత నాయకుడిగా తనను తాను మల్చుకున్న తీరు గొప్పది.
ప్రతి రాజకీయ నాయకుడికి ఉన్నట్లు షింజోకు లోపాలు ఉన్నాయి. కానీ దేశం మరింత ముందుకు వెళ్లేలా చేయడంలో, సంస్కరణలు తీసుకు
రావడంలో ఆయన చేసిన కృషి అసమాన్యం అని చెప్పక తప్పదు
. సుదీర్ఘ కాలం పాటు ప్రధాన మంత్రిగా జపాన్ కు పని చేశారు. వినాశకరమైన భూకంపం, సునామీ, అణు విపత్తు నుండి జపాన్ కోలుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యారు షింజో అబే(Shinzo Abe) .
ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టాడు. ఆ దేశ భవిష్యత్తుకు బాటలు వేశాడు. అనారోగ్యంతో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఎనిమిదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నాడు.
ఆయన కంటే ముందు ఆరేళ్లలో ఆరుగురు ప్రధానలను చూసింది ఆ దేశం. కానీ షింజో అబే లాగా ప్రభావితం చేసిన ప్రధాని లేరు. అణు
విపత్తు నుండి జపాన్ ను కోలుకునేలా చేశాడు.
ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చాడు. రక్షణ రంగానికి ఊపిరి పోశాడు. అధికంగా బడ్జెట్ లో కేటాయించాడు. ఆనాటి అమెరికా చీఫ్
ట్రంప్ తో కలిసి నడిచాడు.
భారత్ తో స్నేహ సంబంధాన్ని కొనసాగించాడు. చైనాను ఎదిరించాడు. ఆ దేశానికి చుక్కలు చూపించాడు. తైవాన్ కు అండగా నిలబడ్డాడు.
యావత్ ప్రపంచం ఇవాళ గొప్ప నాయకుడిని, అంతకంటే భవిష్యత్తు పట్ల నమ్మకం కలిగిన దిగ్గజాన్ని కోల్పోయినందుకు విషాదంలో మునిగి పోయింది.
Also Read : చైనాపై షింజో అబే ధిక్కార స్వరం