Shiv Pal Yadav : ఎస్పీపై శివ పాల్ సింగ్ యాదవ్ ఫైర్
ఎస్పీ సమావేశాలకు పిలుపు లేదు
Shiv Pal Yadav : పీఎస్పీ చీఫ్ శివ పాల్ సింగ్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఆయన యూపీలోని సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను టార్గెట్ చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనసు మార్చుకుని కలిసి ప్రచారం చేశారు. కలిసి పోటీలో ఉన్నారు. కానీ అనూహ్యంగా ఎస్పీ సీట్లను చేజిక్కించు కోలేక పోయింది.
దీంతో ములాయం సింగ్ యాదవ్ కు దగ్గరి వాడైన శివ పాల్ సింగ్ యాదవ్(Shiv Pal Yadav) కొంత కాలం దూరంగా ఉన్నారు. ఆపై ఆయన అఖిలేష్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేస్తూ వచ్చారు.
శనివారం శివ పాల్ సింగ్ యాదవ్ జాతీయ మీడియాతో మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. సమాజ్ వాది పార్టీ ఏ సమావేశానికి తమను ఆహ్వానించడం లేదని ఆరోపించారు.
మిత్ర ధర్మాన్ని విస్మరించడం ఒక రకంగా మోసం చేసినట్లేనని పేర్కొన్నారు శివ పాల్ సింగ్ యాదవ్. రాజకీయ అపరిపక్వత లేక పోవడం వల్లనే ఇదంతా జరుగుతోందంటూ మండిపడ్డారు.
దీంతో పార్టీకి రోజు రోజుకు ఆదరణ తగ్గుతోందని పేర్కొన్నారు. ఇలా గైతే పార్టీ మనుగడ కష్టమని స్పష్టం చేశారు. పార్టీ బలహీన పడుతోందని, దీంతో ప్రజలు పార్టీని వీడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు శివ పాల్ సింగ్ యాదవ్.
ఏసీ గదుల్లో కూర్చుంటే సమాజ్ వాది పార్టీని ఎవరు ఆదరిస్తారంటూ కామెంట్ చేశారు. ఇకనైనా అఖిలేష్ యాదవ్ తన పనితీరును మార్చు కోవాలని సూచించారు. లేక పోతే కష్టమని స్పష్టం చేశారు.
Also Read : సీఎం సహకారం ద్రౌపది ముర్ము భావోద్వేగం
हमें SP की तरफ़ से कभी भी किसी भी मीटिंग में नहीं बुलाया गया। राजनैतिक अपरिपक्वता की कमी के कारण यह सब होता जा रहा है और पार्टी कमजोर हो रही है, लोग पार्टी छोड़ रहे हैं: शिवपाल सिंह यादव, PSP pic.twitter.com/VTa5zUGw5f
— News24 (@news24tvchannel) July 9, 2022