Shiv Sena vs BJP : నిన్నటి దాకా మిత్రులుగా ఉంటూ వచ్చిన శివసేన, భారతీయ జనతా పార్టీ మధ్య ఆధిపత్య పోరు (Shiv Sena vs BJP)కొనసాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో దాడుల పరంపర కంటిన్యూ అవుతోంది.
మహా వికాస్ అగాధీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ వస్తోంది కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్.
కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే మంత్రులను టార్గెట్ చేసింది.
అంతే కాదు మరాఠా సీఎం ఉద్దవ్ ఠాక్రే ను వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే నవాబ్ మాలిక్ ను కస్టడీలోకి తీసుకుంది.
తాజాగా మాజీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను సీబీఐని అరెస్ట్ చేసింది.
సీఎం ఠాక్రే బావమరిది ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇంకో వైపు మోదీ త్రయాన్ని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్న
శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి , ఎంపీ సంజయ్ రౌత్ భార్య, తనయుడికి చెందిన రూ. 11 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది.
దీంతో కేంద్ర సంస్థలను అడ్డం పెట్టుకుని ఇబ్బందులకు ఉరి చేస్తున్న కేంద్రంతో అమీ తుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యారు సీఎం
. తన ప్రభుత్వంపై ఈడీ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దమైంది.
ఈ మేరకు గతంలో బీజేపీ ప్రభుత్వం(Shiv Sena vs BJP) ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలను తవ్వేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా వాటర్ షెడ్ పథకం అక్రమాలు దర్యాప్తు షురూ అయ్యాయి.
దీంతో పాటు మహారాష్ట్రలోని భారతీయ జనతా పార్టీకి చెందిన వారందరిపై ఫోకస్ పెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రతిపక్ష నేతల్ని చెరసాలలోకి నెట్టి వేసే ప్లాన్ కు ఓకే చెప్పారు.
మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ మంత్రులను జైలుకు పంపింది. దాడులకు ప్రతీకారంగా మరాఠా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను టార్గెట్ చేశారు.
ఆయన ఆధ్వర్యంలో జల్ యుక్త శివర్ యోజన – వాటర్ షెడ్ పథకంలో చోటు చేసుకున్న అవినీతిపై ఫోకస్ పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోంది.
Also Read : అయ్యో కావ్య మారన్ ఎందుకిలా