Shiva Nirvana : అతడు ఒకప్పుడు పంతులు. కానీ సినిమా మీద ఉన్న పిచ్చి అతడిని ఇటు వైపు వచ్చేలా చేసింది. టీచర్ నుంచి దర్శకుడిగా మారారు. ఆ తర్వాత లిరిక్ రైటర్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే పాటలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ప్రధానంగా ఆరాధ్యా అనే పాట దుమ్ము రేపుతోంది. ఎవరీ శివ నిర్వాణ అనే ఉత్కంఠ మొదలైంది. ఆయన పూర్తి పేరు శివ నిర్వాణ కాదు. శివ శంకర్ లాలం పుట్టిన పేరు. సినిమా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. తన పేరును శివ నిర్వాణ అనే దానిని ఇష్టపడ్డారు.
Shiva Nirvana Writer
2017లో నిన్ను కోరి చిత్రం తీశాడు. 2019లో మజిలీ తీశాడు. 2021లో టక్ జగదీశ్ రూపొందించాడు శివ నిర్వాణ. విశాఖపట్టణం జిల్లా సబ్బవరం స్వస్థలం. 2005లో సినీ రంగంలోకి ప్రవేశించాడు. బీఇడీ చేశాడు. టీచర్ అయ్యాడు. కానీ ఎందుకనో మనసు ఒప్పుకోలేదు. గుండె మొత్తం సినిమా అంటూ లబ్ డబ్ అంటూ కొట్టుకుంది. ఇంకేం పంతులు పదవికి గుడ్ బై చెప్పేశాడు. 2010లో రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్రకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. 2011లో పరుశు రామ్ తీసిన సోలో సినిమాకు పని చేశాడు శివ నిర్వాణ.
2019లో 20వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ కథా రచయితగా మజిలీ గెలుచుకుంది. అదే ఏడాది సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో ఉత్తమ దర్శకుడిగా తెలుగు నుంచి నామినేట్ చేయబడ్డాడు శివ నిర్వాణ. నిన్ను కోరిలో గీత రచయితగా మారాడు. మజిలీకి కూడా పాటలు రాశాడు..కొరియోగ్రాఫర్ కూడా చేశాడు శివ నిర్వాణ. టక్ జగదీష్ తీశాడు..దానికి కూడా రాశాడు. ప్రస్తుతం ఖుషీ(Kushi) సినిమాకు పాటలు రాస్తున్నాడు.
Also Read : Jailer Kaavaalaa Song : జైలర్ కావాలా సాంగ్ రికార్డ్ బ్రేక్