Shivam Dube : శివ‌మెత్తిన శివ‌మ్ దూబే

కోల్ క‌తాకు చుక్క‌లు

ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ భారీ స్కోర్ ను న‌మోదు చేసింది. ఆపై కోల్ క‌తా పై 49 ర‌న్స్ తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 235 ర‌న్స్ చేసింది.

ఈసారి ఐపీఎల్ లో త‌క్కువ ధ‌ర‌కు అమ్ముడు పోయిన అజింక్యా ర‌హానే ఈసారి త‌న ఆట తీరుకు భిన్నంగా ఆడాడు. క్లాసిక్, బంప‌ర్ , షాన్ దార్ షాట్స్ తో దుమ్ము రేపుతున్నాడు. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు చుక్క‌లు చూపించాడు. త‌న జ‌ట్టు భారీ స్కోర్ సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

ముందుగా బ‌రిలోకి దిగిన చెన్నై కోల్ క‌తా బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఓపెన‌ర్లు డేవిడ్ కాన్వే , రుతురాజ్ గైక్వాడ్ లు శుభారంభం ఇచ్చారు. కాన్వే మ‌రోసారి హాఫ్ సెంచ‌రీతో మెరిస్తే రుతురాజ్ ప‌ర్వాలేద‌నిపించాడు.

రుతురాజ్ ఔట్ అయ్యాక బ‌రిలోకి వ‌చ్చిన శివ‌మ్ దూబే శివ‌మెత్తాడు. కేవ‌లం 21 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 50 ర‌న్స్ చేశాడు. జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ర‌హానే తో క‌లిసి 85 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

Leave A Reply

Your Email Id will not be published!