Shoaib Akthar :పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావిల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన కామెంట్స్ చేశాడు. తీవ్ర వత్తిళ్ల వల్లనే భారత జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడంటూ ఆరోపించారు.
ఏడేళ్ల పాటు టీమిండియాకు విశిష్ట సేవలు అందించిన గొప్ప ఆటగాడిగా కోహ్లీకి కితాబు ఇచ్చాడు అక్తర్(Shoaib Akthar). తనంతకు తాను రాజీనామా చేసేలా బీసీసీఐ పెద్దలు చేశారంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా టీ20, వన్డేతో పాటు టెస్టు కెప్టెన్సీ నుంచి తాను సారథ్యం వహించ లేనంటూ ప్రకటించాడు విరాట్ కోహ్లీ. దీంతో తాజా, మాజీ ఆటగాళ్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
గాడి తప్పిన భారత జట్టుకు ఎనలేని విజయాలు అందించాడని పేర్కొన్నాడు షోయబ్ అక్తర్(Shoaib Akthar). ప్రస్తుతం ఓమన్ వేదికగా లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో పాల్గొంటున్న అక్తర్ మీడియాతో మాట్లాడారు.
కోహ్లీ తానంతకు తాను కెప్టెన్సీ నుంచి తప్పు కోలేదు. కావాలనే తప్పుకునేలా చేశారంటూ మండిపడ్డారు. ప్రపంచంలో అత్యుత్తమ ప్లేయర్లలో కోహ్లీ ఒకడు.
అద్భుతమైన బ్యాట్స్ మెన్. మిగతా క్రికెటర్ల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కానీ అతడిని తప్పుకోవాలంటూ అవమాన పరిచారంటూ ఆరోపించాడు షోయబ్ అక్తర్.
ప్రస్తుతం ఫామ్ లేమితో ఉన్నప్పటికీ త్వరలోనే దానిని అధిగమిస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నాడు. ఒక్కసారి కుదురుకున్నాడంటే ఇక కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదన్నాడు.
అద్భుతమైన టెక్నిక్ అతడి స్వంతమంటూ పేర్కొన్నాడు షోయబ్ అక్తర్. కోహ్లీ త్వరలోనే ఫామ్ లోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నాడు.
Also Read : వేలం పాటకు వేళాయెరా