Shoaib Akthar : కోహ్లీ అద్భుత‌మైన ఆట‌గాడు

వ‌త్తిడిలో సైతం మెరిసే ప్లేయ‌ర్

Shoaib Akthar : పాకిస్తాన్ రావిల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్(Shoaib Akthar) కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. విరాట్ కోహ్లీ అద్భుత‌మైన ఆటగాడ‌ని కానీ అత‌డిపై ఎప్పుడూ లేనంత‌టి వ‌త్తిడి ఉంద‌ని పేర్కొన్నాడు.

త‌నంత‌కు తాను కెప్టెన్సీ నుంచి త‌ప్పుకునేలా చేశారంటూ ఆరోపించాడు. ప్ర‌పంచంలోని టాప్ బ్యాట‌ర్ ల‌లో కోహ్లీ ఒక‌డ‌ని అత‌డు గ‌నుక తిరిగి ఫామ్ లోకి వ‌స్తే ఆప‌డం ఎవ‌రి త‌రం కాద‌న్నాడు.

తానైతే ఫ‌స్ట్ ప్ర‌యారిటీ క్రికెట్ ఆడేందుకు ఇస్తాన‌ని కానీ పెళ్లి చేసుకునే ఉండే వాడిని కాద‌న్నాడు. బీసీసీఐ సెలెక్ల‌ర్టు అత‌డిని త‌ప్పించే సాహసం చేయ‌ర‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.

ఎందుకు త‌ప్పుకున్నాడ‌నేది కోహ్లీ వ్య‌క్తిగ‌త ఇష్ట‌మ‌న్నాడు షోయ‌బ్ అక్త‌ర్(Shoaib Akthar). సెలెక్ట‌ర్లు వైట్ బాల్ ఫార్మాట్ కు కొత్త వ్య‌క్తిని ఎంపిక చేయాల‌ని అనుకున్నారు. అందుకే కోహ్లీ త‌ప్పించ‌క ముందే త‌ప్పుకున్నాడ‌ని తాను అనుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు.

ఇదిలా ఉండ‌గా ఓమ‌న్ లో లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో పాల్గొంటున్న షోయ‌బ్ అక్త‌ర్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. విరాట్ కావాల‌ని కెప్టెన్సీని విడిచి పెట్ట‌లేదు. కానీ తప్పుకునేలా ప‌రిస్థితులు త‌లెత్తాయ‌ని తెలిపాడు.

కానీ ఇది స‌మ‌యం కాద‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పాడు షోయ‌బ్ అక్త‌ర్. ఒక బ్యాట‌ర్ గా ట‌న్నుల కొద్దీ ప‌రుగులు సాధించాడు. ఒక్క‌సారి సెటిల్ అయ్యాడంటే అత‌డిని పెవిలియ‌న్ కు పంప‌డం క‌ష్ట‌మ‌న్నాడు.

మ‌రో వైపు ర‌విశాస్త్రి సైతం ఇంకా రెండేళ్ల పాటు టెస్టు కెప్టెన్సీ నిర్వ‌హించే స‌త్తా కోహ్లీకి ఉంద‌న్నాడు.

Also Read : స‌ఫారీ టూర్ మాకు గుణ‌పాఠం

Leave A Reply

Your Email Id will not be published!