Shoaib Akthar : పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావిల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన షోయబ్ అక్తర్(Shoaib Akthar) వివాదాస్పద కామెంట్స్ చేశాడు. టీమిండియా బౌలర్లపై నోరు పారేసుకున్నాడు. ఆసిస్ మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీతో మాట్లాడాడు అక్తర్.
మనోళ్ల ఆహారపు అలవాట్లను ప్రస్తావించాడు. భారత జట్టు మా పేసర్లతో పోటీ పడలేరు. ఎందుకంటే మేం మాంసం తింటాం. బలిష్టంగా ఉంటాం. మా పేసర్లు తిండి ప్రభావంతో కసి మీద ఉంటారన్నాడు.
కానీ భారత పేసర్లు బలహీనంగా ఉంటారని వాళ్లు వికెట్లు తీయడంలో వెనుకంజలో ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత పేసర్లు పుంజుకున్నా పాకిస్తాన్ ప్రస్తుత పేసర్లతో ఢీకొనడం కష్టమేనని పేర్కొన్నాడు షోయబ్ అక్తర్(Shoaib Akthar).
ప్రపంచంలో మమ్మల్ని ఢీకొనడం, తట్టుకోవడం బ్యాటర్ల వల్ల కాదన్నాడు. ఒక రకంగా షోయబ్ అక్తర్ టీమిండియా ఆటగాళ్లను కించ పరిచేలా మాట్లాడాడు. మా పేసర్లలో ఉన్నంత కసి వారిలో లేదని ఎద్దేవా చేశాడు.
ఈ తేడా మొదటి నుంచి ఉందన్నాడు. ఇందులో ప్రధానంగా ఆహారంతో పాటు వాతావరణం కూడా మరో ప్రధాన కారణంగా పేర్కొన్నాడు షోయబ్ అక్తర్. పాకిస్తాన్ బౌలర్లు బౌలింగ్ చేసే విషయంలో ముందు వెనుకా ఆలోచించరన్నారు షోయబ్ అక్తర్.
ఎదుటి వాళ్లు ఎలా ఉన్నప్పటికీ బ్యాటర్లను అవుట్ చేయాలనే కసితో ఉంటారని చెప్పాడు. మాలో ఉన్నంత కసి భారత బౌలర్ల లో లేదన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే మేం పులులమని టీమిండియా పేసర్లు పిల్లులంటూ ఎద్దేవా చేశాడు.
Also Read : ఇంగ్లండ్ నే ఓడించాం ఇండియా ఓ లెక్కా