Glenn Maxwell : ఆర్సీబీకి షాక్..మ్యాచ్ కు ‘మాక్స్’ దూరం

ఆసీస్ క్రికెట్ బోర్డు రూల్స్ కార‌ణం

Glenn Maxwell  : ఇవాళ స‌మ ఉజ్జీల మ‌ధ్య స‌మ‌రం సాగ‌నుంది ముంబైలో. నువ్వా నేనా అన్న రీతిలో జ‌ర‌గ‌బోయే ఈ మ్యాచ్ పై భారీ ఎత్తున అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు.

రెండు మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి జోరు మీదున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను ఎలాగైనా స‌రే ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు.

ఇప్ప‌టికే ఈ జ‌ట్టు రెండు మ్యాచ్ లు ఆడి ఒక‌టి మాత్ర‌మే గెలిచింది. ఇవాళ తాడే పేడో తేల్చుకోవాల‌ని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా ఆర్సీబీకి ఆయువు ప‌ట్టుగా ఉన్న ఆసిస్ స్టార్ హిట్ట‌ర్ గ్లెన్ మాక్స్ వెల్(Glenn Maxwell )ఉన్న‌ట్టుండి రాజ‌స్తాన్ తో జ‌రిగే మ్యాచ్ కు దూరం కానున్నాడు.

గాయం కార‌ణంగా అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. కాదు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నియ‌మ నిబంధన‌ల ప్ర‌కారం ఆ దేశానికి చెందిన క్రికెట‌ర్లు ఐపీఎల్ లో పాల్గొనాలంటే ఏప్రిల్ 6 వ‌ర‌కు ఏ టీం తోనూ ఆడ‌కూడ‌దు.

దీంతో ఇవాళ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగే మ్యాచ్ కు ఈ క‌ఠిన రూల్ కార‌ణంగా దూరంగా ఉండ‌నున్నాడు. దీంతో ఆర్సీబీకి విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ ఆడే ఆట‌గాడు లేక పోవ‌డం అన్న‌ది బిగ్ మైన‌స్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ విష‌యాన్ని ఆర్సీబీ డైరెక్ట‌ర్ కూడా ధ్రువీక‌రించ‌డం విశేషం. దీంతో బెంచ్ కే ప‌రిమితం కానున్నాడు మ్యాక్స్ వెల్ అన్న‌మాట‌. ఇదిలా ఉండ‌గా మ‌నోడు ఇటీవ‌లే ఇండియ‌న్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వైర‌ల్ గా కూడా మారాడు.

Also Read : ఉత్కంఠ పోరులో ల‌క్నో విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!