Sheezan Khan Tunisha : శ్రద్దా వాకర్ కేసుతో భయపడ్డా – ఖాన్
విడి పోయాక ఆత్మహత్యా యత్నం
Sheezan Khan Tunisha : నటి తునీషా శర్మ సూసైడ్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న సహ నటుడు సీజాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. మొదటి రోజు సోమవారం పోలీసులకు కీలక సమాచారం అందించాడు. శ్రద్దా వాకర్ కేసు తనను భయ పెట్టిందన్నాడు ఖాన్.
తాను తునీషా శర్మ ప్రేమించుకున్న మాట వాస్తవమేనని, ఆ తర్వాత బ్రేకప్ చెప్పానని తెలిపాడు. తాము విడి పోయాక తునీషా ఆత్మహత్యా యత్నం చేసిందని విచారణలో షీజాన్(Sheezan Khan) వెల్లడించాడు. శ్రద్దా వాకర్ ను దారుణంగా హత్య చేసిన తర్వాత దేశంలో నెలకొన్న వాతావరణం చూసి తాను కలవరానికి గురైనట్లు చెప్పాడు.
దీంతో తునీషాతో బంధాన్ని తెంచు కోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఇరు వర్గాలకు ఇది మంచిది కాదనే నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నాడు ఖాన్. తునీషా చని పోయే కంటే కొన్ని రోజుల ముందు కూడా సూసైడ్ చేసుకునేందుకు యత్నించిందని తెలిపాడు.
ఆమెను రక్షించానని , తునీషా శర్మ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని తల్లి వనితా శర్మకు సూచించానని షీజాన్ ఖాన్ పోలీసులకు తెలిపాడు. ఇదిలా ఉండగా తునీషా శర్మ డిసెంబర్ 24న ఓ టీవీ షూట్ సెట్ లో టాయిలెట్ లో శవమై కనిపించింది. ఆమె తల్లి వనిత ఫిర్యాదుతో 25న సహ నటుడు షీజాన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది.
Also Read : తునీషాను వాడు చంపేశాడు – వనిత