Shreyas Iyer : భారత స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ సంచలన కామెంట్స్ చేశారు. ముంబై వేదికగా ఈనెల 26న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2022 రిచ లీగ్ కు సంబంధించి స్పందించాడు అయ్యర్.
గత నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఊహించని రీతిలో శ్రేయస్ అయ్యర్ ను రూ. 12.25 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
దీంతో ఐపీఎల్ లో సత్తా చాటేందుకు రెడీగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు(Shreyas Iyer) చేశాడు. తాను జట్టుకు సంబంధించి ఏ ప్లేస్ లోనైనా వచ్చేందుకు రెడీగా ఉన్నానని పేర్కొన్నాడు.
గతంలో ఐపీఎల్ లో ఈ కుడి చేతి వాటం బ్యాటర్ ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయకత్వం వహించాడు. మిగతా ఫార్మాట్ లు వేరు ఐపీఎల్ ఫార్మాట్ వేరు అని తెలిపాడు అయ్యర్. బంతికి బ్యాట్ కు మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందన్నాడు.
మైదానంలోకి దిగాక ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నాడు. ఊహించని రీతిలో వికెట్లు కోల్పోవచ్చు. ఇంకో వైపు పరుగులు రావచ్చు.
ఉన్న నిర్ణీత 20 ఓవర్లలో ఏం జరుగుతుందనే దానిపై ఇప్పుడు చెప్పలేమన్నాడు. అయితే జట్టుకు నాయకుడిగా తాను ఏ ప్లేస్ లోనైనా వచ్చేలా ఆలోచిస్తున్నట్లు తెలిపాడు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer).
కెప్టెన్ గా ఏ ప్లేస్ లో వస్తామన్నది ముఖ్యం కాదన్నాడు. జట్టు పరంగా గెలవడం ముఖ్యమన్నాడు. ప్రాథమికంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేసేందుకు రెడీగా ఉండాలని స్పష్టం చేశాడు.
తాను మూడో ప్లేస్ లో వస్తానని పేర్కొన్నాడు. పరిస్థితిని బట్టి ప్లేస్ మారుతుందన్నాడు అయ్యర్.
Also Read : విండీస్ స్కిప్పర్ అరుదైన ఘనత