Shruti Jaipuria : డిజైనింగ్ లో శృతి జైపురియా శభాష్
ప్రిన్సిపల్ డిజైనర్ గా రాణింపు
Shruti Jaipuria : కలలకు రెక్కలు తొడగడంలో ఆమె అందెవేసిన చేయి. ఆమె డిజైన్ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఇది బెంగళూరులో పాపులర్. మైయా అనేది ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ డిజైన్ సంస్థ. దీనిని 2011లో స్థాపించింది ఆమె. భారత దేశంలో మోస్ట్ పాపులర్ సంస్థగా రూపు దిద్దుకుంది. మన ఐడియాస్ కు ఆమె అద్భుతంగా ప్రాణం పోసేలా చేయడంలో అందె వేసిన చేయి. బ్రాండ్ లు క్రియేట్ చేస్తారు. ఆపై అనుభవాలను కూడా డిజైన్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నారు శ్రుతి జైపురియా(Shruti Jaipuria).
మైయా ఫ్యాషన్ , రిటైల్ , రెసిడెన్షియల్ , కమర్షియల్ రంగాలలో ప్రాజెక్టులను చేపడుతుంది. మెటీరియల్ లో వివరాణత్మక అన్వేషణలు ఉంటాయి. మానవ ప్రవర్తన అధ్యయనం, కళాకారులు, చెఫ్ లు, గృహ యజమానులతో కలిసి ప్రత్యేకమైన అనుభవాలకు రెక్కలు తొడిగేలా చేస్తారు.
యువ శక్తివంతమైన టీం ఆమె ఏర్పాటు చేసుకున్నారు. వారంతా నిత్యం ఇదే పనిలో ఉంటారు. ప్రకృతిని డిజైన్ లో ఎలా ప్రతిఫలింప చేయవచ్చనేది ఆచరణలో చేసి చూపిస్తున్నారు శ్రుతి జైపురియా.
ప్రకృతి, ఆధ్యాత్మికత, గణితం , జ్యామితి, పదార్థాలు, ఆకృతి , రంగు అన్నీ అంతులేని స్పూర్తిని అందిస్తాయంటారు ఆమె. దేశంలోని 50 ఉత్తమ గృహాలకు ఎల్లే డెకోర్ ఐడీ ఆనర్స్ అవార్డు దక్కింది 2019లో.
ఐఐఐడి బెస్ట్ యంగ్ ప్రాక్టీస్ అవార్డును 2018లో పొందారు. ట్రెండ్స్ డిజైన్ అవార్డ్స్ 2016లో రిటైల్ విభాగంలో విజేతగా నిలిచారు. బెస్ట్ ప్రాజెక్ట్ గుడ్ హోమ్స్ 2015లో , ఎన్డీటీవీ డిజైన్ పురస్కారం అందుకున్నారు శ్రుతి జైపురియా. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ , గోవా, ముంబైలలో ప్రాజెక్టులను పూర్తి చేయడం ఆమె పనితీరుకు నిదర్శనం.
Also Read : డిజిటల్ రంగం ఉపసనా తకు విజయం