Shruti Sood : కంటెంట్ క్రియేష‌న్ లో ‘శ్రుతి’ సూప‌ర్

మార్నింగ్ లాజినెస్ ఫౌండ‌ర్

Shruti Sood : మ‌హిళ‌లు వ్యాపార‌వేత్త‌లుగానే కాదు స్పూర్తి దాయ‌కంగా మారుతున్నారు. వారిలో ఒక‌రు శ్రుతి సూద్. అత్యంత చిన్న వ‌య‌స్సులోనే బెస్ట్ ఎంట్ర‌ప్రెన్యూర్ గా గుర్తింపు పొందారు. ఆమె స్థాపించిన సంస్థ ఎంద‌రికో ఉపాధి క‌ల్పించేలా చేసింది. త‌నతో పాటు ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌కాశాలు స‌మానంగా ఉంటాయ‌ని కానీ భిన్నంగా ఆలోచించినప్పుడే ఏదైనా స‌క్సెస్ అన్న‌ది ద‌క్కుతుందంటారు శ్రుతి సూద్(Shruti Sood). ఆమె మార్నింగ్ లాజినెస్ అనే పేరుతో స్టార్ట‌ప్ సంస్థ‌ను ఏర్పాటు చేశారు.

ఇది ఉత్త‌మ వ్య‌వ‌స్థాప‌క ఆలోచ‌న‌లు, లైఫ్ గైడ్ లు , రిలేష‌న్ షిప్ స‌ల‌హాలు , వెల్ నెస్ , ఫ్యాష‌న్ , ఆరోగ్యం, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను దీని ద్వారా అంద‌జేస్తారు. స‌మాజానికి ఏదైనా అందించాల‌న్న‌ది త‌న క‌ల‌. డిజిట‌ల్ యుగంలో ప్ర‌తిదీ సాధ్య‌మేన‌ని భావించాను. కంప్యూట‌ర్ సైన్స్ చ‌దువుకున్న శ్రుతి సూద్(Shruti Sood) మొద‌ట‌గా బ్లాగ‌ర్ గా మారారు. డిజిట‌ల్ మార్కెటింగ్ కంపెనీలో కంటెంట్ రైట‌ర్ గా చేరారు. తాను ఏదైతే క‌ల‌ను క‌న్నానో అది సాకారం అయ్యేందుకు దోహ‌ద ప‌డుతుంద‌ని న‌మ్మాను.

శ్రుతి సూద్ ఒక‌టే న‌మ్ముతారు. బాగా ఆలోచించండి. మీ మాట‌ల‌తో సృజ‌నాత్మ‌కంగా ఉండండి. అప్పుడు ఆన్ లైన్ ప్ర‌పంచం మీకు చాలా అవ‌కాశాల‌ను ఇస్తుందంటారు. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ప్ర‌తి దానిలోను ప‌రిణ‌తి సాధించారు.

మీరు ఎంత లోతుగా వెళితే అంత‌గా ఆక‌ర్షించేలా చేస్తుంద‌ని న‌మ్ముతారు. 2018లో మార్నింగ్ లాజినెస్ ప్రారంభించింది. క‌రోనా కాలంలో జాబ్ కోల్పోవ‌డం కూడా ఇబ్బందిగా మారింది. పాపుల‌ర్ ఈ మ్యాగ‌జైన్ గా మారి పోయింది.

ఇందులో 500 మందికి పైగా ర‌చ‌యిత‌లు భాగ‌స్వాములయ్యారు. మ‌హిళా వ్య‌వ‌స్థాప‌క‌త‌, ఆరోగ్యం, ఫిట్ నెస్ , వ్యాపార చిట్కాలు, యోగా , ధ్యానం వంటి భిన్న మార్గాల‌ను క‌వ‌ర్ చేస్తోంది. కంటెంట్ ఆధారిత ప్లాట్ ఫార‌మ్ గా గుర్తింపు పొందింది.

Also Read : ప‌ర‌దా దాటుకుని పైలట్ అయిన ఫాతిమా

Leave A Reply

Your Email Id will not be published!