Shubman Gill : శుభ్ మ‌న్ గిల్ క‌మాల్ క‌ర్ దియా

క్లాసిక‌ల్ ఇన్నింగ్ ఆడిన క్రికెట‌ర్

Shubman Gill : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో మ్యాచ్ లో ఒక్కొక్క ఆట‌గాడు మెరుపులు మెరిపిస్తూ త‌మ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

ముంబై వేదిక‌గా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగింది పంజాబ్ కింగ్స్ , గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య‌. ముంద‌గా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లో 189 ప‌రుగులు చేసింది.

గుజ‌రాత్ ముందు 190 ర‌న్స్ టార్గెట్ ఉంచింది. ఇక మ్యాచ్ ఆద్యంత‌మూ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో చివ‌రి బంతి దాకా మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ‌ను రేపింది.

ఈ త‌రుణంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు గుజ‌రాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాహుల్ తెటాటియా. ఆఖ‌రు ఓవ‌ర్ లో 2 బంతుల్లో రెండు సిక్స్ లు కొట్టి ప‌ని పూర్తి చేశాడు.

కానీ అంత‌కు ముందు ఆ జ‌ట్టులో కీల‌కమైన క్లాసిక‌ల్ ఇన్నింగ్స్ ఆడాడు శుభ్ మ‌న్ గిల్(Shubman Gill). 59 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ఈ క్రికెట‌ర్ ఏకంగా 96 ప‌రుగులు చేశాడు.

అంటే కేవ‌లం నాలుగు ప‌రుగుల దూరంలో సెంచ‌రీ చేయ‌కుండా ఉండి పోయాడు. కానీ గుజ‌రాత్ విక్ట‌రీలో ఇత‌డిదే కీల‌క పాత్ర‌. త‌న ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు ఓ సిక్స్ కూడా ఉంది.

అందుకే మ‌నోడిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేసింది. ఏది ఏమైనా అస‌లైన ఐపీఎల్ మజాను క‌లిగించింది ఈ లీగ్ మ్యాచ్. దీంతో లీగ్ లో గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Also Read : తాగిన ఆట‌గాడు న‌న్ను వేలాడ‌దీశాడు

Leave A Reply

Your Email Id will not be published!