Shubman Gill : అబ్బా శుభ్ మన్ గిల్ దెబ్బ
సెంచరీతో కదం తొక్కిన క్రికెటర్
Shubman Gill : అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ -2లో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంది. ఫైనల్ కు వెళ్లాలని ఆశ పడిన ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ లో ఓపెనర్ శుభ్ మన్ గిల్(Shubman Gill) మరోసారి రెచ్చిపోయాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో దంచి కొట్టాడు. గిల్ దెబ్బకు ముంబై ఇండియన్స్ విల విల లాడింది.
ఐపీఎల్ 16వ సీజన్ లో ఏకంగా మూడు సెంచరీలు చేయడం మామూలు విషయం కాదు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. గిల్ షాట్స్ తో స్టేడియం హోరెత్తి పోయింది. ఐపీఎల్ లో భారీ స్కోర్ చేసింది . శుభ్ మన్ గిల్ దంచి కొట్టడం, సెంచరీ పూర్తి చేయడంతో మరోసారి ఛాంపియన్ తానేనంటూ చెప్పకనే చెప్పింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
తాను తీసుకున్న నిర్ణయం తప్పని తేలింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ప్లే ఆఫ్స్ లో ఇదే భారీ స్కోర్ కావడం విశేషం. ఓపెనర్ శుభ్ మన్ గిల్ 129 రన్స్ చేశాడు. తుఫాన్ సెంచరీతో సెన్సేషన్ ఇన్నింగ్స్ ఆడాడు.
శుభ్ మన్ గిల్ కేవలం 49 బంతులు మాత్రమే ఎదుర్కొని సెంచరీ చేశాడు. ప్లే ఆఫ్స్ లో శతకం సాధించిన అతి పిన్న వయసు కలిగిన క్రికెటర్ గా నిలిచాడు. మరో ఆటగాడు సాయి సుదర్శన్ 31 బంతులు ఎదుర్కొని 43 రన్స్ చేశాడు. పాండ్యా 13 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 28 రన్స్ చేశాడు.
Also Read : Chiranjeevi K Vasu