Siddaramaiah Comment : జ‌నం ‘నేస్తం’ సిద్ద‌రామ‌య్య ‘ప్ర‌స్థానం’

ఎవ‌రీ సిద్ద‌రామ‌య్య ఏమిటా క‌థ

Siddaramaiah Comment : క‌న్న‌డ నాట ఎవ‌రిని అడిగినా ఠ‌కీమ‌ని చెప్పే ఏకైక పేరు సిద్ద‌రామ‌య్య‌. అంతలా ఆయ‌న ప్రాచుర్యం పొందారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్ర‌త్యేకించి సామాన్యుల‌కు ఆయ‌న ఆత్మ బంధువుగా వినుతికెక్కారు. ఘ‌న‌మైన సోష‌లిస్టుగా త‌న‌ను తాను నిరూపించుకున్నారు. వ‌య‌సు రీత్యా మీద ప‌డినా సిద్ద‌రామ‌య్యనే ప్ర‌జ‌లు అత్య‌ధికంగా కోరుకుంటున్నారంటే ఆయ‌న‌కు ఉన్న చ‌రిష్మా ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చు. త‌న‌ను తాను అజ్ఞాత‌వాసిగా స్వ‌యంగా ఒప్పుకున్నాడు. ఆహార్యమే కాదు జీవితం కూడా సాధార‌ణమే. అందుకే సిద్ద‌రామ‌య్య అంటే జ‌నానికి వ‌ల్ల‌మాలిన అభిమానం.

తెల్ల‌టి కుర్తా, పంచె, ఒక విధ‌మైన లుంగీ , అంగ వ‌స్త్రం ఇదీ ఆయ‌న బ్రాండ్, అదే ట్రేట్ మార్క్. ప‌ల్లెలో ఉన్న సాధార‌ణ‌మైన రాజ‌కీయ నాయ‌కుడిని త‌ల‌పింప చేస్తారు సిద్ద‌రామ‌య్య‌. ఒక‌ప్పుడు ప‌శువుల కాప‌రి. అక్క‌డి నుంచి అంచెలంచెలుగా లా చేశాడు. దేవ‌రాజ్ ఉర్స్ త‌ర్వాత క‌ర్ణాట‌క‌లో ఐదేళ్ల కాలం పాటు పూర్తి చేసిన రెండ‌వ ముఖ్య‌మంత్రిగా గుర్తింపు పొందారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడ‌టం ఆయ‌న నైజం. ఇదే త‌న‌కు బ‌లం అని అంటారు. అనూహ్యంగా ఆయ‌న రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అయ్యారు. జ‌న‌తా ప‌రివార్ వ‌ర్గాల్లో స‌భ్యుడిగా ఉన్నారు. 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉర్స్ త‌ర్వాత రాష్ట్రంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన నాయ‌కుడిగా జ‌నం చేత ఆద‌రించ‌బ‌డ్డారు సిద్ద‌రామ‌య్య‌. అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టిన ఘ‌న‌త కూడా ఆయ‌న‌కే ద‌క్కింది.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆద‌రించేలా ప్ర‌య‌త్నం చేశాడు. వీరిలో మైనార్టీలు, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు, ద‌ళితులు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ ఇష్ట పడేలా మారారు సిద్ద‌రామ‌య్య‌. డాక్ట‌ర్ రామ్ మ‌నోహ‌ర్ లోహియా సోష‌లిజం ప‌ట్ల ఆక‌ర్షితుడ‌య్యాడు. 1978లో మైసూర్ లోని నంజుండ స్వామి అనే లాయ‌ర్ ఆయ‌న‌ను గుర్తించారు. నువ్వు ఇక్క‌డ కాదు ఉండాల్సింది రాజ‌కీయాల్లో అని సూచించాడు. 1983లో మాజీ పీఎం చ‌ర‌ణ్ సింగ్ సార‌థ్యంలోని భార‌తీయ లోక్ ద‌ళ్ నుండి టికెట్ పొందారు. చాముండేశ్వ‌రి సీటు నుండి గెలుపొందారు. క‌న్న‌డ అధికార భాష అమ‌లు క‌మిటీకి చీఫ్ గా ఎన్నిక‌య్యారు. జ‌న‌తా పార్టీలో చేరారు. 1985 మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో సిద్ద‌రామ‌య్య గెలుపొందారు. మంత్రిగా కొలువు తీరారు. 1989లో ఓడి పోయారు. 1994లో తిరిగి త‌న స్థానాన్ని నిల‌బెట్టుకున్నారు.

దేవెగౌడ నేతృత్వంలోని జ‌న‌తాద‌ళ్ ప్ర‌భుత్వంలో ఆర్థిక మంత్రిగా ప‌ని చేశారు సిద్ద‌రామ‌య్య‌. 1996లో డిప్యూటీ సీఎం గా ఎన్నిక‌య్యారు. జ‌న‌తాద‌ళ్ లో చీల‌క వ‌చ్చింది. 2004లో ధ‌ర‌మ్ సింగ్ సీఎంగా ఉండ‌గా తిరిగి ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. దేవె గౌడ‌కు సిద్ద‌రామ‌య్య‌కు గొడ‌వ‌ల కార‌ణంగా పార్టీ నుండి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు. 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆనాటి నుంచి నేటి దాకా వెనుదిరిగి చూడ‌లేదు. సీఎంగా ప‌ని చేశారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ప్ర‌స్తుతం సిద్ద‌రామ‌య్య చ‌ర్చ‌నీయాంశంగా మార‌డంలో ఆశ్చ‌ర్యం ఏమీ లేదు. ఎందుకంటే ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో క్లీన్ ఇమేజ్ క‌లిగి ఉండ‌డం చాలా క‌ష్టం. ఆ ఒక్క‌టి మాత్రం ఆయ‌న‌కు ఉంది. క‌నుక‌నే పార్టీ ఆయ‌న వైపు మొగ్గు చూపింది.

Also Read : CM KCR

Leave A Reply

Your Email Id will not be published!