Siddique Kappan : ఇంకా చెరసాలలోనే సిద్దిక్ కప్పన్
బెయిల్ మంజూరైనా ఇంకా కస్టడీలోనే
Siddique Kappan : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం ప్రశ్నించే వాళ్లపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రధానంగా జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, మేధావులు, కళాకారులు ఇప్పుడు పలు కేసులను ఎదుర్కొంటున్నారు. జైళ్లల్లో మగ్గుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్(Siddique Kappan).
యూపీ లోని ఉగ్రవాద నిరోధక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం – యూఏపీఏ కింద అరెస్ట్ అయ్యాడు. రెండు సంవత్సరాల తర్వాత కప్పన్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విభాగం కార్యదర్శి దళిత బాలికపై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య తర్వాత పరిణామాలను కవర్ చేసేందుకు హత్రాస్ కు వెళుతుండగా యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మనీ లాండరింగ్ కేసు కారణంగా ఇంకా జైలులోనే ఉన్నారు. సిద్దిక్ కప్పన్(Siddique Kappan) మళయాళం న్యూస్ పోర్టల్ అజీముఖంలో పాత్రికేయుడిగా పని చేస్తున్నారు. కంప్యూటర్ ఇంజనీర్ కూడా. సౌదీ అరేబియాలో కొంత కాలం పని చేశాడు. 2021లో తన తండ్రి మరణించడంతో భారత దేశానికి తిరిగి వచ్చాడు.
ఆనాటి నుండి మలయాళ మీడియాలో పని చేస్తున్నాడు. 5 అక్టోబర్ 2020న సిద్దిక్ కప్పన్ తో పాటు ముగ్గురు క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు అతిక్ ఉర్ రహమాన్ , మసూద్ అహ్మద్ , ఆలం మథుర నుండి హత్రాస్ కు వెళుతుండగా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం సీఎఫ్ఐ అనేది ప్రస్తుతం నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా విద్యార్థి విభాగం.
Also Read : మాజీ ఎంపీకి మహిళా కమిషన్ సమన్లు