Sidhu Jail : సిద్దూ ఖైదీ నెంబర్ 241383
ఏడాది కఠిన కారగార శిక్ష
Sidhu Jail : స్పీడ్ గా డ్రైవింగ్ చేయడమే కాక, ఒకరి మృతికి కారణమయ్యాడనే నెపంతో పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ , మాజీ క్రికెటర్, యాంకర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎట్టకేలకు లొంగి పోయారు.
పాటియాలా కోర్టు జడ్జి ఆయనను జైలుకు పంపాలని ఆదేశించారు. సిద్దూ కు ఛాతిలో నొప్పి అనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సలు అందించారు.
అనంతరం జైలుకు తరలించారు. అక్కడ సిద్దూకు ఖైదీ నెంబర్ 241383 కేటాయించారు. బ్యారక్ 7లో ఉంచారు. ఇందులో భాగంగా సిద్దూ(Sidhu Jail) వెంట భారీ ఎత్తున నాయకులు, అనుచరులు, మద్దతుదారులు చేరుకున్నారు. వారందరినీ ఆయన వద్దని వారించారు.
తాను కోర్టు తీర్పునకు లోబటి ఉంటానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా చెరసాలలో సిద్దూకు ఓ టేబుల్, రెండు టర్పన్లు, ఓ కప్ బోర్డు, దుప్పటి, రెండు తువ్వాళ్లు, దోమ తెర, ఓ పెన్ను, రాసుకునేందుకు నోటు పుస్తకం, రెండు బెడ్ షీట్స్ , నాలుగు జతల కుర్తా పైజామాలు జైలు అధికారులు అందజేశారు.
కాగా సిద్దూ ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. కాగా 38 ఏళ్ల కిందటి కేసులో సిద్దూకు శిక్ష పడింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ఖరారు చేసింది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయం, ధర్మం, శిక్ష అందరికీ ఒకేలాగా ఉంటుందన్నారు. ఇదే సమయంలో సెలిబ్రిటీలు, పేరొందిన వారు, ప్రముఖులు, పొలిటికల్ లీడర్లకు ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.
మొత్తంగా ఒక వెలుగు వెలిగిన సిద్దూ ఇవాళ జైలులో సాధారణ ఖైదీలాగా గడపడం విచిత్రం కదూ.
Also Read : టీడీపీ కామెంట్స్ బుగ్గన సీరియస్