Sidhu Bhagwant Mann : పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ , మాజీ క్రికెటర్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ సంచలన కామెంట్స్ చేశారు. గత కొంత కాలం నుంచీ ఆయన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు.
కానీ ఉన్నట్టుండి రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 సీట్లు గెలుచుకుని విజయఢంకా మోగించింది. ఈ సందర్భంగా సిద్దూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్ ప్రజలు నిజాయతీకి పట్టం కట్టారంటూ ప్రశంసించారు. ఈ తరుణంలో ఆయన పీసీసీ చీఫ్ గా ఉంటూ కామెంట్ చేయడంపై కలకలం రేగింది.
అనంతరం నాటకీయ పరిణామాల మధ్య సిద్దూ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయనను రాజీనామా చేయాల్సిందిగా ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ఆదేశించారు. సిద్దూ ప్రస్తుతం పంజాబ్ లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.
ఈ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Sidhu Bhagwant Mann)ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాన్ తన స్వంత తమ్ముడి లాంటి వాడంటూ కితాబు ఇచ్చాడు.
మాఫియా నిర్మూలనలో అద్భుతంగా పని చేస్తున్నాడంటూ ప్రశంసించాడు. పనిలో పనిగా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారు సిద్దూ. ఆయన చేతిలో భగవంత్ మాన్ కీలుబొమ్మ లాగా మారాడంటూ ఆరోపించాడు.
రాష్ట్రంలో ఆక్టోపస్ లాగా అల్లుకు పోయిన మాఫియా ను ఎదుర్కొనేందుకు భగవంత్ మాన్ ఒక్కడే శ్రమిస్తున్నాడంటూ పేర్కొన్నాడు సిద్దూ. భగవంత్ మాన్ నా తమ్ముడు.
అతను నిజాయతీ పరుడు. నేను ఎప్పుడూ వేలు ఎత్తి చూపలేదన్నాడు. మాఫియాకు వ్యతిరేకంగా పోరాడితే తన మద్దతు ఉంటుందన్నాడు. ఇప్పుడు సిద్దూ కామెంట్స్ కలకలం రేగాయి.
Also Read : కాంగ్రెస్ కంటే బీజేపీ బెటర్