Sihmachalam : సింహాచలంలో వరుణ యాగం

త్రిపురాంతక స్వామి కి అభిషేకం

Sihmachalam : సింహాచలం – ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో సమృద్దిగా వర్షాలు కురవాలని సింహగిరి పై వరుణ యాగం అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ మేరకు బుధవారం సింహాచలేశుని(Sihmachalam) ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీ త్రిపురాంతక స్వామివారి దేవాలయంలో స్వామి వారికి అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు.

Sihmachalam Programs

ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం జరిపించారు. వైదికులంతా గంగ ధారకు వెళ్లి పవిత్ర జలాలను తీసుకువచ్చి మూల,విరాట్ నీ అభిషేకించారు. స్వామివారికి అర్చన చేసి వైదికులు, అధికారులు మరోసారి గంగధారకు వెళ్లి పూర్ణకలశతో ప్రకృతి జలాలను తీసుకువచ్చి త్రిపురాంతకుడ్ని అభిషేకం చేశారు.

మంగళ నీరాజనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ ఎస్.శ్రీనివాసమూర్తి మాట్లాడారు.
ఈ యాగము తో విస్తారము గా వర్షాలు కురవాలని ఆకాంక్షను వ్యక్తం చేసారు..అంతే కాకుండా కార్తీక మాసం లో వరుణ యాగం చేపట్టడం ఎంతో శుభ పరిణామం అన్నారు. త్రిపురాంతక స్వామి ఆలయం లో జరిగే అన్ని ఉత్సవాల లో భక్తులును మరింతగా భాగ స్వామ్యం చేయాలన్నారు.

అయా పూజా కార్య క్రమాలలో ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు, బయ్యవరపు రాధ,ఏ ఈ ఓ లు పి నరసింగరావు, నారసింహరాజు, ఆలయ అర్చకులు రమణమూర్తి, వేద పండితులు సురేష్, సుబ్రహ్మణ్యం , వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : Amit Shah : దీదీ పాల‌న‌లో ఆగ‌మాగం

Leave A Reply

Your Email Id will not be published!