Silicon Valley Bank : సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మూసివేత‌

కొనుగోలు చేసేందుకు ఓకే అన్న ఎలోన్ మ‌స్క్

Silicon Valley Bank : ప్ర‌పంచంలో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ బ్యాంకుల‌కు కూడా పాకింది. అమెరికాలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తూ వ‌చ్చిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్ప‌కూలింది. దాదాపు $175 బిలియ‌న్ల క‌స్ట‌మ‌ర్ డిపాజిట్లు ప్ర‌స్తుతం ఫెడ‌ర‌ల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ నియంత్ర‌ణ‌లో ఉన్నాయి. కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేట‌ర్లు సిలికాన్ వ్యాలీ బ్యాంకు మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2008లో ప్ర‌పంచ ఆర్థిక సంక్షోభం త‌ర్వాత ఇదే అతి పెద్ద రిటైల్ బ్యాంకింగ్ వైఫ‌ల్యం.

48 గంట‌ల నాట‌కీయ‌మైన త‌ర్వాత ఈ చ‌ర్య చోటు చేసుకోవ‌డం విశేషం. సంబంధిత క‌స్ట‌మ‌ర్ల డిపాజిట్ల‌పై ప‌రుగుల మ‌ధ్య హైటెక్ రుణ దాతకు సంబంధించిన షేర్ ధ‌ర క్షీణించింది. టెక్ స్టార్ట‌ప్ ల‌లో పెట్టుబ‌డి పెట్టుబ‌డి ద్వారా భారీ సంప‌ద‌ను ఆర్జించిన త‌ర్వాత సిలికాన్ వ్యాలీ బ్యాంక్ త‌న ఆస్తుల‌లో ఎక్కువ భాగం యుఎస్ బాండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టింది. ద్ర‌వ్యోల్బ‌ణం రేట్ల‌ను త‌గ్గించేందుకు ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ గ‌త ఏడాది వ‌డ్డీ రేట్ల‌ను పెంచ‌డం ప్రారంభించింది. దీని ఫలితంగా బాండ్ విలువలు త‌గ్గాయి.

క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత స్టార్ట‌ప్ ఫండింగ్ ఇబ్బందిక‌రంగా మారింది. ఫ‌లితంగా బ్యాంక్ ఖాతాదారులు అధిక సంఖ్య‌లో డ‌బ్బుల‌ను డ్రా చేసుకున్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) దాని పెట్టుబ‌డుల‌లో కొన్నింటిని విక్ర‌యించాల్సి వ‌చ్చింది. వీటి విలువ త‌గ్గుతూ వ‌చ్చింది. ఈ వారం ప్రారంభంలో ఒక ప్ర‌క‌ట‌న‌లో బ్యాంకు దాదాపు $2 బిలియ‌న్ల‌ను కోల్పోయింద‌ని స్ప‌ష్టం చేసింది.

బీమా చేసిన డిపాజిట్ల‌కు పూర్తి భ‌ద్ర‌త ఉంటుంద‌ని ఎఫ్డీఐసీ వెల్ల‌డించింది. పాత బ్యాంకు చెక్కుల‌ను కూడా గౌర‌విస్తామ‌ని ఆర్థిక సంఘం వెల్ల‌డించింది.

Also Read : 150 దేశాల‌కు వ్యాక్సిన్ పంపిణీ – మ‌న్సుఖ్

Leave A Reply

Your Email Id will not be published!