Silicon Valley Bank Comment : ‘సిలికాన్’ పతనం దేనికి సంకేతం
భారతీయ బ్యాంకులకు గుణపాఠం
Silicon Valley Bank Comment : ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రతి రంగంపై పడుతోంది. ఇది పక్కన పెడితే ప్రపంచాన్ని శాసించాలని పరితపిస్తున్న అమెరికాలో ఉన్నట్టుండి పేరొందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్(Silicon Valley Bank) కుప్ప కూలింది. గత కొంత కాలంగా పెద్ద ఎత్తున స్టార్టప్ ల గురించి ప్రచారం జరుగుతోంది.
ప్రధానంగా భారత దేశంలో అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్టార్టప్ ఇండియా పేరుతో ముందుకు వెళుతున్నారు. ప్రధాన బ్యాంకులన్నీ వాటికి ప్రయారిటీ ఇస్తూ వస్తున్నాయి. ఇది పక్కన పెడితే అమెరికా బ్యాంకింగ్ రంగంలో టాప్ లో కొనసాగుతున్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎందుకు ఉన్నట్టుండి మూసి వేతకు గురైందో తెలుసుకుంటే విస్తు పోక తప్పదు.
ఇదొక్కటే కాదు ఇంతకు ముందు కూడా మరో బ్యాంక్ కూడా మూసి వేయబడింది. ఇప్పటి వరకు రెండు ప్రధాన బ్యాంకులు చేతులెత్తేశాయి.
దీంతో అకస్మాత్తుగా కుప్ప కూలడంతో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై సిలికాన్ బ్యాంకు అర్ధాంతరంగా మూసి వేయడం తీవ్ర ప్రభావం చూపుతోంది. $620 బిలియన్ల ప్రమాదం గురించి ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హెచ్చరించింది.
అమెరికా లోని వాషింగ్టన్ లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో హెడ్ జాగ్రత్తగా ఉండమని చెప్పినా పట్టించు కోలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ పదేళ్లలో అతి పెద్ద కుదుపుగా పరిగణించక తప్పదు. సిలికాన్ వ్యాలీ బ్యాంకు వ్యవస్థాపకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రధానంగా కుప్ప కూలడానికి కారణం స్టార్టప్ లకు పెద్ద ఎత్తున ఫండింగ్ సపోర్ట్ చేయడం వల్లనే సిలికాన్ కుప్ప కూలిందనే విమర్శలు ఉన్నాయి. బ్యాంకులు ఇకనుంచైనా జాగ్రత్తగా వ్యవహరించక పోతే కుప్పు కూలే ప్రమాదం ఉందని ఎఫ్ డీఐసీ చైర్మన్ మార్టిన్ గ్రుయెన్ బర్గ్ హెచ్చరించారు.
2008లో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభం తర్వాత రెండు బ్యాంకులు కుప్ప కూలాయి. 24కు పైగా భారీ ఎత్తున రుణాలు తీసుకోవడం కూడా సిలికాన్ ను కొంప ముంచేలా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. స్టాక్స్ లో ఉన్నట్టుండి 16 శాతం పడి పోయాయి.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్(Silicon Valley Bank Comment) ప్రమాదంలో ఉందని ఇలాగే రుణాలు ఇస్తూ పోతే ఏదో ఒక రోజు మూసుకోక తప్పదంటూ 2017లో కరెన్సీకి యాక్టింగ్ కంట్రోలర్ గా పని చేసిన కీత్ నోరెయికా హెచ్చరించారు.
2022లో $220 బిలియన్లకు పెరిగినా ఎందుకని కుప్ప కూలిందనే దానిపై ఇంకా అనుమానం నెలకొంది. స్టార్టప్ లు, వెంచర్లకు నిధులు మంజూరు చేయడం , ఖాతాలు కలిగి ఉన్న వారు పెద్ద ఎత్తున డబ్బులను డ్రా చేసుకోవడంతో సిలికాన్ చేతులెత్తేసింది.
విచిత్రం ఏమిటంటే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ భారత దేశంలో కనీసం 21 స్టార్టప్ లలో పెట్టుబడులను బహిర్గతం చేసింది. 2,500 వెంచర్ క్యాపిటల్ సంస్థలకు సిలికాన్ బ్యాంకుగా ఉంది. రోకు, కాంప్ సైన్స్ , అంబరెల్లా , రోబ్ లాక్స్ , లెండింగ్ క్లబ్ , సున్నోవా సనర్ నర్ , రాకెట్ ల్యాబ్ , వీమో , స్టెమ్ ఉన్నాయి.
వీటితో పాటు ఫార్మా సంస్థలు క్రిప్టో కరెన్సీ స్టార్టప్ లలో కూడా రుణాలుగా ఇచ్చింది సిలికాన్ వ్యాలీ బ్యాంక్. వీటిని పక్కన పెడితే దేశంలోని టాప్ బ్యాంకులలో 16వ ప్లేస్ లో ఉన్న సిలీకాన్ ఎలా దిగజారి పోయిందనే దానిపై ఆర్బీఐ, ఇతర బ్యాంకులు , ఆర్థిక సంస్థలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
Also Read : భారతీయ నిర్మాణంలో విశ్వకర్మలు – మోదీ