Neeraj Chopra : జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు రజతం
88.13 మీటర్ల బెస్ట్ త్రో తో ప్రదర్శన
Neeraj Chopra : ఒరెగాన్ లోని యూజీన్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో భారత్ కు చెంది నీరజ్ చోప్రా(Neeraj Chopra) సత్తా చాటాడు. 88.13 మీటర్ల బెస్ట్ త్రోతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఈ ఘనతను చోప్రా కేవలం 08.34 సెకండ్లలో సాధించడం విశేషం. నాల్గో ప్రయత్నం ద్వారా సాధ్యమైంది. గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్ల బెస్ట్ త్రోతో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు.
పీటర్స్ తొలి ప్రయత్నంలో 90.21 మీటర్లు విసిరాడు. రెండో ప్రయత్నంలో 90.46 మీటర్లతో మెరుగ్గా నిలిచాడు. తన ప్రపంచ టైటిల్ ను కాపాడుకునేందుకు ఆరో ప్రయత్నంలో తన అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు పీటర్స్ .
ఇక చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకుబ్ వ్లడెజ్చ్ 88.09 మీటర్ల బెస్ట్ త్రోతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 86.86 మీటర్ల బెస్ట్ ప్రయత్నంతో 4వ స్థానంలో నిలిచాడు.
2003లో కాంస్య పతకం గగెలిచిన లాంగ్ జంపర్ అంజు జాబీ జార్జ్ తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో పతకం సాధించిన రెండో భారతీయుడు, మొదటి భారతీయుడు చోప్రా కావడం విశేషం.
నీరజ్ చోప్రా ఫౌల్ త్రోతో ప్రారంభించాడు. రెండో ప్రయత్నంతో 82.39 మీటర్లను నమోదు చేశాడు. జావెలిన్ 86.37 మీటర్లు విసిరినిప్పుడు చోప్రా తన మూడో ప్రయత్నంతో కాస్తా మెరుగు పడ్డాడు.
నాలుగో ప్రయత్నంతో 88.13 మీటర్ల త్రోను నమోదు చేసి నాల్గో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. ఇదే పోటీలో ఉన్న మరో భారత ఆటగాడు రోహిత్ యాదవ్ 78.72 మీటర్ల బెస్ట్ త్రోతో 10వ స్థానంలో నిలిచాడు.
Also Read : నీ విజయం దేశానికి గర్వ కారణం