Singareni Elections : సింగ‌రేణి ఎన్నిక‌ల‌పై ఉత్కంఠ

నేడే కార్మిక సంఘం ఎన్నిక‌లు

Singareni Elections : సింగ‌రేణి – రాష్ట్రంలో సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్(Congress) పార్టీ స‌ర్కార్ కు ఈ ఎన్నిక‌లు స‌వాల్ గా మారాయి. అధికారిక కార్మిక సంఘానికి సంబంధించి కార్మికులు త‌మ ఓటు వినియోగించు కోనున్నారు.

Singareni Elections Viral

బ్యాలెట్ ప‌ద్ద‌తిలో సింగ‌రేణి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. సింగ‌రేణి కాల‌రీస్ లో 39 వేల 809 మంది కార్మిక ఓట‌ర్లు ఉన్నారు. ఉద‌యం నుంచి ఓట్ల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. రాత్రి 11.30 గంట‌ల వ‌ర‌కు తుది ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉందని స‌మాచారం.

ప్ర‌స్తుతం గ‌తంలో కొలువు తీరిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన అనుబంధ కార్మిక సంఘం టీజీబీకేఎస్ కొన‌సాగుతోంది. ఇప్పుడు ఎన్నిక‌ల నుంచి అనూహ్యంగా స‌ద‌రు సంఘం పోటీ చేయ‌డం నుంచి త‌ప్పుకుంది. ప‌లువురు కార్మిక సంఘం నేత‌లు పోటీ చేయ‌కుండా త‌ప్పుకోవ‌డం విస్తు పోయేలా చేసింది.

ఇదిలా ఉండ‌గా సింగ‌రేణి కాల‌రీస్ కు సంబంధించి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నిక‌లు ఏడోసారి జ‌రుగ‌నుండ‌డం విశేషం. విచిత్రం ఏమిటంటే మిత్ర‌ప‌క్ష పార్టీల‌కు సంబంధించిన గుర్తింపు కార్మిక సంఘాల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొన‌డం విస్తు పోయేలా చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తింపు సంఘానికి వామ‌ప‌క్షాల‌కు చెందిన కార్మిక సంఘానికి మ‌ధ్య పోటీ నెల‌కొంది.

Also Read : Sunburn Event : స‌న్ బ‌ర్న్ కు షాక్ కేసు న‌మోదు

Leave A Reply

Your Email Id will not be published!