Rahul Dravid : భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ టెస్టులో విజయం సాధించి ఊపు మీదున్న భారత జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది సఫారీ టీం. రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
మూడో టెస్టు కేప్ టౌన్ లో ప్రారంభం కానుంది. దీంతో ఇరు జట్లు మూడు టెస్టుల సీరీస్ లో భాగంగా చెరీ సగం గెలిచి ఊపు మీదున్నాయి. ఇదిలా ఉండగా రెండో టెస్టు జరుగుతున్న సమయంలో హైదరాబాద్ స్టార్ పేసర్ సిరాజ్ గాయపడ్డాడు.
దీంతో మూడో టెస్టుకు ఉంటాడా లేదా అన్న అనుమానం నెలకొంది. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు రాహుల్ ద్రవిడ్(Rahul Dravid). మ్యాచ్ ముగిసిన అనంతరం హెడ్ కోచ్ మీడియాతో మాట్లాడారు.
ఇంకా నెట్ ప్రాక్టీస్ కు రాలేదు. గాయం ఇంకా మానలేదు. ఏ ప్లేయర్ అయినా ప్రాక్టీస్ కంపల్సరీ. అది లేకుండా ఎవరినీ తుది జట్టులోకి తీసుకునే ప్రసక్తి లేదన్నాడు రాహుల్. సిరాజ్ దూరం కావడం మాకు పెద్ద దెబ్బ అని పేర్కొన్నాడు హెడ్ కోచ్.
అయితే ఆఖరు టెస్టులో ఉమేష్ యాదవ్ ,ఇషాంత్ శర్మలు అందుబాటులో ఉన్నారని తెలిపాడు. ఈనెల 11న మూడో టెస్టు ఆఖరిదవుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్ల మధ్య మరింత రసవత్తరం కానుంది.
పలువురు ఆటగాళ్లు ఎవరు ఉంటారనే దానిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇక రెండో టెస్టుకు సంబంధించి కెప్టెన్ గా ఉన్న కోహ్లీ వెన్నెముక గాయం కావడంతో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ నాయకత్వం వహించాడు.
Also Read : పాయింట్ల పట్టికలో సఫారీ ముందంజ