Sitanshu Kotak : భారత జట్టు కోచ్ గా సితాన్సు కోటక్
ఐర్లాండ్ టూర్ కు బీసీసీఐ ఎంపిక
Sitanshu Kotak : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ , ప్రస్తుత ఇండియా ఎ ప్రధాన కోచ్ గా ఉన్న సితాన్సు కోటక్ ను హెడ్ కోచ్ గా నియమించింది. ఐర్లాండ్ లో జరగబోయే 3 టి20 సీరీస్ ఆడనుంది టీమిండియా. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని రెగ్యులర్ కోచింగ్ సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో సితాన్సు కోటక్(Sitanshu Kotak) ఆగస్టు 18 నుండి 23 వరకు జరిగే ఐర్లాండ్ సీరీస్ కు జట్టుకు మార్గ నిర్దేశం చేయనున్నాడు.
Sitanshu Kotak Promoted
రాహుల్ ద్రవిడ్ తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో పాటు ఇతర సిబ్బందికు రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. ఇక త్వరలో ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ను ఐర్లాండ్ సీరీస్ కు తాత్కాలిక ప్రధాన కోచ్ గా నియమించాలని భావించింది.
కానీ లక్ష్మణ్ ఇందుకు ఒప్పుకోలేదు. తాను హెడ్ కోచ్ గా కంటే ఎన్సీఏ కు బాధ్యత వహిస్తానని స్పష్టం చేయడంతో బీసీసీఐ మనసు మార్చుకుంది. చివరకు మహారాష్ట్ర వెటరన్ క్రికెటర్ సితాన్సుకు అవకాశం ఇచ్చింది. ఆయన కేవలం ఈ సీరీస్ కు మాత్రమే హెడ్ కోచ్ గా వ్యవహరిస్తాడు.
Also Read : Asia Cup Commentary Panel : ఆసియా కప్ కామెంటరీ ప్యానెల్