Putin : యుద్దం చేయాలంటే దమ్ముండాలి. అంతకు మించి వ్యూహాలు పన్నేవాళ్లు కావాలి. రోజు రోజుకు ప్రపంచంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ పుతిన్ ఏ మాత్రం తగ్గడం లేదు.
రాజ్య కాంక్షతో, ఆధిపత్య ధోరణితో ముందుకు వెళుతూనే ఉన్నాడు. కానీ ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్దానికి పుతిన్(Putin) నిర్ణయం వెనుక ఉన్నది మాత్రం ఆ ఆరుగురే. వాళ్లే కీలకం.
పుతిన్ కు బలం బలగం కూడా వాళ్లే. అందుకే వారితో సంప్రదించకుండా ఎలాంటి చర్చలు అన్నది జరపకుండా
ఒక్క మాట కూడా బయటకు మాట్లాడడు పుతిన్. ఓ వైపు యావత్ ప్రపంచం యుద్దం వద్దన్నా పట్టించు కోవడం లేదు పుతిన్.
ప్రస్తుతం ఆయన ఓ రాక్షసుడిగా మారి పోయారు. అమెరికా వార్నింగ్ ఇచ్చినా ఇతర దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అన్నాడు.
ఇక అసలు పుతిన్ వెనుక ఉన్నది ఎవరో తెలుసుకుంటే ఆశ్చర్యం వేయక మానదు.
పుతిన్ ఓ పట్టాన ఎవరినీ సామాన్యంగా నమ్మడు. కానీ ఆరుగురు మాత్రం
ఆయన టీంలో కీలకం. వారిలో సెర్గీ షాయిగు ఇతడు రష్యాకు రక్షణ శాఖ మంత్రి. ఈయన ఏది చెబితే అదే వేదం.
ఉక్రెయిన్ వ్యూహ రచన కూడా అతడిదేనంటారు. పుతిన్ కు మరో విధేయుడిగా ఉన్నాడు.
అతడే వలేరి జెరసిమోవ్. సాయుధ బలగాల చీఫ్. మరొకరు రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్ పత్రుషెవ్.
పుతిన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటున్న వ్యకతి అలెగ్జాండర్ బోర్టనికోవ్ .
ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఆయన ఏది చెప్పినా పుతిన్ చేయాల్సిందే.
పుతిన్ కు నీడలా ఉండేది సెర్గీ నారిష్కిన్. ఎస్వీఆర్ డైరెక్టర్ గా ఉన్నాడు.
ఇక పుతిన్ వాయిస్ ను ప్రపంచానికి తెలియ చెప్పడంలో దిట్ట సెర్గీ లావరోవ్. మనోడు పుతిన్ కేబినెట్ లో సీనియర్ లీడర్.
పుతిన్ అత్యంత బలమైన, శక్తివంతమైన నాయకుడు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యాక రష్యాకు పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు యత్నించాడు.
అంతే కాదు ప్రస్తుతం ప్రపంచంలో టాప్ లో ఉండేలా చేశాడు. అందుకే ఆయన ఉక్రెయిన్ పై వార్ ప్రకటించిన సమయంలో కొద్ది మంది తప్పా ఎవరూ పెద్ద ఎత్తున అభ్యంతరం తెలియ చేయలేదు.
Also Read : వార్న్ మరణం క్రికెట్ లోకం విషాదం